»   » టీవీ యాంకర్ మల్లిక మరణం వెనుక అసలు కారణమేమిటో తెలుసా!

టీవీ యాంకర్ మల్లిక మరణం వెనుక అసలు కారణమేమిటో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనదైన శైలిలో వ్యాఖ్యాతతో ఆకట్టుకొన్న యాంకర్, సినీ నటి మల్లిక మరణం సినీ, టెలివిజన్ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతూ మల్లిక సోమవారం బెంగళూరులో మరనించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆమె పార్దీవ దేహాన్ని సందర్శించిన కొందరు మల్లికతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.

కొంతకాలంగా కోమాలో..

కొంతకాలంగా కోమాలో..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక 20 రోజులుగా కోమాలోనే ఉన్నట్టు బంధువులు పేర్కొన్నారు. ఆమెను మామూలు స్థితికి చేర్చడానికి డాక్టర్లు శతవిధాలుగా ప్రయత్నించారు అని వారు పేర్కొన్నారు. బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా కోమాలోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మంచి వ్యాఖ్యాతగా

మంచి వ్యాఖ్యాతగా

మల్లిక అసలు పేరు అభినవ. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను కూడా దక్కించుకొన్నారు. జెమిటీ టీవీలో ప్రసారం అవుతున్న ‘నాతిచరామి' సీరియల్‌లోనూ మల్లిక నటించారు.

సింగిల్ టేక్‌లో ఒకే..

సింగిల్ టేక్‌లో ఒకే..

ఎమోషనల్‌ సీన్స్‌లో నాలుగు అయిదు పేజీల డైలాగ్స్‌ను కూడా సింగిల్‌ టేక్‌తో చేసేవారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు' సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.

వివాహం తర్వాత నటనకు దూరం

వివాహం తర్వాత నటనకు దూరం

విజయ్‌ సాయి వివాహం తర్వాత నటనకు దూరమయ్యారు. ఆమెకు కుమారుడు కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లో జరిగాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు భగవంతుడిని వేడుకొన్నారు.

బాస్కెట్‌ బాల్‌ క్రీడలో

బాస్కెట్‌ బాల్‌ క్రీడలో

కేవలం నటనలోనే కాకుండా మల్లిక క్రీడలంటే కూడా ఇష్టం. బాస్కెట్‌ బాల్‌ క్రీడలో జాతీయస్థాయి ప్లేయర్‌ కూడా. నటన, యాంకరింగ్, క్రీడల్లో రాణించిన మల్లిక చిన్నవయసులోనే మరణించడంపై ఆమె సన్నిహితులు కన్నీరుమున్నీరయ్యారు.

English summary
Notable anchor turned actress Mallika passed away in Bangalore today morning after suffering from illness for some time. She has allegedly been in a coma for the past 2 weeks and spent her last days in a hospital in Bangalore. She is popularly known as Tring Tring Mallika for Telugu audience. She acted in Venkatesh’s Kalisundam Raa, Ninne Pelladutha and many other movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu