»   » చలపతిరావు వ్యాఖ్యలు: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. నేను బాధితురాలినే.. హేమ

చలపతిరావు వ్యాఖ్యలు: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. నేను బాధితురాలినే.. హేమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన చలపతిరావు వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించింది. నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు తప్పేనని, కానీ తన తప్పును తెలుసుకొని సారీ చెప్పినందున ఆయనపై కేసులు ఉపసంహరించుకోవాలని మహిళా సంఘాలను హేమ కోరింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలపై మహిళా సంఘాల స్పందనపై ప్రశంసల వర్షం కురిపించింది. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలు హానికరం కాదు. వారు పక్కలోకి బాగా పనికివస్తారు అని చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

కేసు ఉపసంహరించుకోండి..

కేసు ఉపసంహరించుకోండి..

తెలుగు సినిమా పరిశ్రమలో చలపతిరావు సీనియర్ నటులు. ఆయన చాలా సరదాగా ఉంటారు. ఇప్పటివరకు మహిళా నటులను వేధించినట్టుగానీ, వారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఏదో మాటజారి వ్యాఖ్యలు చేయడం జరిగిందని టెలివిజన్ చానెళ్లకు వెళ్లి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఆయనపై దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోండి అని ఆమె సూచించింది.

మహిళలంతా ఐక్యంగా..

మహిళలంతా ఐక్యంగా..

మహిళలంతా ఐక్యమత్యంగా పోరాడాలి. ఎవ్వరూ గానీ, వెబ్‌సైట్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ స్త్రీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మనమంతా ఐక్యంగా ఉండాలి. మహిళలపై ఎవరైనా వ్యాఖ్యలు చేయడానికి భయపడే విధంగా మనం చర్యలు తీసుకోవాలి.

నేను బాధితురాలినే..

నేను బాధితురాలినే..

గతంలో నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. అప్పుడు నా వెనుక ఎవరూ లేరు. కానీ ఇప్పుడు మహిళలంతా ఏకమవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళలు పోరాటం చేయాలి. వారికి నేను అండగా ఉంటాను. మాలాంటి వారికి వారు కూడా సహకారం అందించాలి అని హేమ చెప్పింది. సంస్కారవంతంగా చలపతిరావు క్షమాపణ చెప్పినందున కేసులు ఉపసంహరించుకోవాలి అని ఆమె కోరింది.

ఝాన్సీ కృషి అభినందనీయం..

ఝాన్సీ కృషి అభినందనీయం..

మహిళ తరఫున పోరాటం సాగించేందుకు నటి ఝాన్సీ మహిళా సంఘాలతో కలిసి చలపతిరావు కేసు నమోదు చేయడం చాలా సంతోషమేసింది. సినీ నటులుగానీ, సామాన్య పౌరులు గానీ ఇక నుంచి ఆడవాళ్ల గురించి చెడుగా మాట్లాడేటప్పుడు వందసార్లు ఆలోచించండి. వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

‘మా' కఠిన చర్యలు

‘మా' కఠిన చర్యలు

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో ఎవరైనా ఆడవాళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని సంఘం స్పష్టం చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఎవరైనా స్త్రీలపై బూతు మాట్లాడితే వారి సభ్యత్వం రద్దు చేస్తాం. చలపతిరావు వ్యవహారంపై మా సంస్థ ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ అంతా వచ్చి సారీ చెప్పినట్టే అని హేమ పేర్కొన్నది.

వెబ్ మీడియాకు హెచ్చరిక

వెబ్ మీడియాకు హెచ్చరిక

సోషల్ మీడియా, వెబ్ మీడియా సినీ నటుల మీద రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదైనా రాసేటప్పుడు తన తల్లి, సోదరి, కుటుంబ సభ్యులైతే అలానే రాస్తారా అని ఆలోచించాలి. ఆడవాళ్ల గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి. గతంలో ఇలాంటి సంఘటనలు బాగా జరిగాయి. ఇక నుంచి అలాంటివి జరుగకూడదు. ఇప్పుడు మహిళలు ఏకతాటిపైకి రావడం చూస్తే సీఎం అయినంత, ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది అని హేమ స్పందించారు.

English summary
Actress Hema responded to media on Chalapathirao derogatery comments. She said withdrawn all cases against Chalapathirao due to apology which he tendered. Hema expressed her happiness over Women unity on such incidents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu