For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘యాక్షన్’ 3డి మూవీ ప్రత్యేకలు (ఫోటోఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ఇతర ముఖ్య పాత్రదారులు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం.

  యాక్షన్ 3డి చిత్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. మరి ఆ విశేషాలను తాజా వాల్ పేపర్లు వీక్షిస్తూ....తెలుసుకుందాం.

  భారత దేశంలో ఇప్పటి వరకు ఒక కామెడీ మూవీని 3డి ఫార్మాట్లో రూపొందించ లేదు. ఈ ఘనత తొలిసారిగా ఈ చిత్రానికే దక్కుతుంది.

  కామెడీ అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు...యాక్షన్ సీన్లతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

  ఈగ చిత్రంలో విలన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు సుదీప్ ఈచిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

  ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరికొత్తగా రొమాంటిక్ సాంగులతో అలరించనున్నారు. ఇందులోని కొన్ని పాటలు రాఘవేంద్రరావు సినిమాలను గుర్తుకు తెస్తాయి.

  మరో కామెడీ హీరో సునీల్ యాక్షన్ 3డి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ పాత్ర సినిమాలో ఎంతో ముఖ్యమైనది అంటున్నారు దర్శకుడు అనిల్ సుంకర

  హీరోగా నిలదొక్కుకోలేక పోతున్న వైభవ్ ఆ తర్వాత సైడ్ హీరో పాత్రలకే పరిమితం అయ్యాడు. తెలుగులో ఆ అవకాశాలు కూడా అతనికి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ 3డి చిత్రం తన కెరీర్ కు ప్లస్సవుతుందని భావిస్తున్నాడు.

  ఈ చిత్రంలోని కొన్ని పాటల్లో విదేశీ భామలు బికినీల్లో అందాల విందు చేయబోతున్నారు. ఆ సన్నివేశాలు శృంగార ప్రియులకు మంచి కిక్ ఇవ్వనున్నాయి.

  హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఈ చిత్రంలో గ్లామర్ రోల్ పోషిస్తోంది. ఆమె పాత్ర సినిమాకు ఎంతోకీలకం.

  యాక్షన్ 3డి చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు పెద్దలు మాత్రమే చూడదగిన చిత్రమని సర్టిఫై చేసినట్లు తెలుస్తోంది.

  సినిమా ప్రమోషన్ సరికొత్తగా నిర్వహిస్తున్న నిర్మాతలు.....మా సినిమా చూడండి, డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్స్ పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ‘సినిమా చూసిన తర్వాత మీ టికెట్ నెంబర్, పర్సనల్ డీటేల్స్ ‘56263' అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి. లేదా action3dofficial@gmail.com కి ఈ-మెయిల్ చేయడం. అన్ని ఖర్చులు వారే భరిస్తారు. ఇంకేం...ఈ నెల 21న విడుదలవుతున్న సినిమా చూసి మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి.

  ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

  English summary
  Action, The comedy film in 3D of the South Indian film industry, simultaneously made in Telugu and Tamil languages. The film is directed by Anil Sunkara and features an ensemble cast of Allari Naresh, Shaam, Vaibhav, Raju Sundaram, Kamna Jethmalani, Sneha Ullal, Ritu Barmecha and Neelam Upadhyaya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X