Just In
- 3 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 4 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 5 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ జూన్ 7కి వాయిదా
హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మే 31 నుంచి జూన్ 7వ తేదీకి వాయిదా పడింది.
జూన్ 24న విడుదల కావాల్సిన 'ఇద్దరమ్మాయిలతో' మే 31కి వాయిదా పడటంతో....ఆ రోజు విడుదల కావాల్సిన 'యాక్షన్ 3డి' చిత్రం జూన్ 7కి వాయిదా పడింది. థియేటర్ల కేటాయింపు సమస్య కారణంగా ఇలా జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన
ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లరి నరేష్ సినిమా అంటే....కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, టైమింగ్ తో కూడిన పంచ్ డైలాగులు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. రాను రాను అల్లరి నరేష్ సినిమాలు పంథా మారుతున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తోడవుతున్నాయి.
ఈ మధ్య వచ్చిన పలు సినిమాల్లో డాన్సుల విషయంలోనూ తనదైన మార్కు చూపించిన నరేష్...తాజాగా శృంగార రసాన్ని కూడా ప్రేక్షకులపై ఒలికించ బోతున్నాడు. యాక్షన్ 3డి' చిత్రంలో చిత్రీకరించిన ఓ సాంగు......దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలను గుర్తు తెచ్చాయి. హీరోయిన్ బొడ్డుకు రకరకాల పండ్లు, పూలతో టచ్చింగులు, పాలతో హీరోయిన్ అందాలను తడిపేయడం లాంటి సీన్లతో ఈ సాంగు శృంగార రసాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వనుంది.
రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.