‘యాక్షన్’ 3డి...విడుదల మళ్లీ వాయిదా

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈచిత్రం....మరోసారి వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల జూన్ 21కి వాయిదా వేసారు. సెన్సార్ బోర్డు వారు చేస్తున్న ఆలస్యం కారణంగా జూన్ 14 విడుదల కావాల్సిన ఈచిత్రాన్ని మరో వారం ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోందిజ

ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం.

సునీల్, పోసాని ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి.

3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X