»   » డైరక్టర్ అవుతున్న పీటర్ హెయిన్...డిటేల్స్

డైరక్టర్ అవుతున్న పీటర్ హెయిన్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ...త్వరలో మెగా ఫోన్ పడుతూ డైరక్టర్ గా మారుతున్నారు. అయితే ఆయన తీయబోయే సినిమా ఏ తమిళమో, తెలుగో కాదు..వియత్నమీ భాషలో ఆయన తన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని పీటర్ హెయిన్ స్వయంగా ధృవీకరించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పీటర్ హెయిన్ మాట్లాడుతూ... "డైరక్టర్ గా నా తొలి చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇది ఏదో అర్జెంటుగా కంగారులో తీసుకున్న నిర్ణయం కాదు. నేను గత రెండు సంవత్సరాలుగా ఈ డైరక్షన్ క్రాప్ట్ ని నేర్చుకుంటూ వస్తున్నాను. అంతే కాదు పూర్తి హోమ్ వర్క్ తో డైరక్షన్ లోకి దిగుతున్నాను ". అన్నారు

 Action Choreographer Peter Hein turns Director

అలాగే...తనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, శంకర్, మణిరత్నం, త్రివిక్రమ్ వంటి దర్శకులనుంచి సపోర్టు ఉందన్నారు. ఇక పీటర్ హెయిన్స్ డైరక్ట్ చేసే చిత్రం యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది..పూర్తి ఫైట్స్ తో ఉంటుందని భావిస్తున్నారు కదా...అలాంటిదేమో కాదు. ఫ్యామిలి ఎమోషన్స్ తో కూడిన చిత్రం అని తెలుస్తోంది. ఇందులో రెండు మాత్రమే ఫైట్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి చాలా రియలిస్టిక్ గా ఉండేలా పీటర్ హెయిన్స్ ప్లాన్ చేస్తున్నారు.

సౌత్ ఇండియాలో స్టైలిష్ యాక్షన్ కోరియోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. ‘ఛత్రపతి', ‘మగధీర' సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి పనిచేసిన పీటర్ హెయిన్స్ ప్రస్తుతం ‘బాహుబలి' సినిమాకి కూడా ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.

పీటర్ హెయిన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టమైన ప్రాజెక్ట్ ‘బాహుబలి' అని అన్నాడు. ఈ సినిమాలో తను సుమారు 2000 మంది ఫైటర్స్ మరియు ఏనుగులను కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. ‘ఇదొక పీరియడ్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్ తో కలిసి పనిచేసాను కాబట్టి నా పనిని కాస్త సులభతరం అవుతోందని' పీటర్ అన్నాడు.

బాహుబలి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రెండు పార్ట్స్ గా తెరకెక్కుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

English summary
Ace Action Choreographer is all set to wield the megaphone and it will be in his mother tongue Vietnamese.
Please Wait while comments are loading...