»   » యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన ఘనత.. 150వ సినిమాగా కురుక్షేత్రం

యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన ఘనత.. 150వ సినిమాగా కురుక్షేత్రం

Written By:
Subscribe to Filmibeat Telugu

మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు లాంటి హిట్ చిత్రాలతో యాక్షన్ కింగ్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. కెరీర్ లో అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150వ సినిమా చేస్తున్నాడు. మళయాలంలో మోహన్ లాంటి అగ్రహీరోను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ మూవీకి తెలుగులో ''కురుక్షేత్రం'' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో..

తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో..

తమిళంలో ‘నిబునన్'గా కన్నడంలో ‘విస్మయ' రిలీజ్ కానున్నది. పూర్తిగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘కురుక్షేత్రం' ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పూర్తి వైవిధ్యంగా కనిపిస్తోన్న ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఇదో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా కనిపిస్తున్నది. చిత్ర ఆరంభం నుంచి చివరికి వరకూ అత్యంత ఉత్కంఠగా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అదనపు బలం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

వైవిధ్యమైన పాత్రలో..

వైవిధ్యమైన పాత్రలో..

ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఓ అద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో అర్జున్ పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కంప్లీట్ స్టైలిష్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మూవీ టీజర్ ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయి దుమ్మురేపుతోంది.

ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్‌లుక్

ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్‌లుక్

ఇక తెలుగులో రిలీజ్ చేసిన ‘కురుక్షేత్రం' ఫస్ట్‌లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సుదీర్ఘంగా సాగిన తన కెరీర్ లో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు పలు అవార్లులను అందుకున్న అర్జున్ తన 150వ సినిమాను మరింత మెమరబుల్ గా మార్చుకోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ తెలుగు టీజర్ ను కూడా అతి త్వరలోనే విడుదల చేసి.. సినిమాను జులై నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్..

శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్..

ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్‌తో‌పాటు శ్రుతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం : ఎస్ నవీన్ సంగీతాన్ని, అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీని, సతీష్ సూర్య ఎడిటింగ్, అరుణ్ వైద్యనాథన్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

English summary
Action King Arjun is one of the very few actors in the film industry, who can boast of having acted in 150 films in their career. His 150th film, which has been directed by Arun Vaidyanathan, is gearing up for release soon. The film's Telugu version has been titled as 'Kurukshetram'. The same film will release in Tamil as 'Nibunan' and in Kannada as “Vismaya”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu