For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ గా తెలుగు యాక్షన్ హీరో కుమార్తె ఎంట్రీ

  By Srikanya
  |

  హైదరాబాద్: మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు, జెంటిల్‌మేన్‌, ఒకే ఒక్కడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో అర్జున్‌. ఇప్పుడాయన పెద్ద కుమార్తె హీరోయిన్ గా కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆ అమ్మాయి పేరు... ఐశ్వర్య. విశాల్‌ హీరోగా 'పట్టత్తు యానై' అనే చిత్రం త్వరలో మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్యను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో ప్లస్‌టూ చదివే విద్యార్థినిగా ఆమె పాత్ర ఉంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం విజువల్‌ కమ్యూనికేషన్స్‌కి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల అయిదో తేదీన మొదలవుతుంది.

  జి.కె. ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపై విశాల్ హీరోగా ఓ చిత్రం ప్రారంభం కానుంది. శశికాంత్ దర్శకుడుగా పరిచయవౌతున్న ఈ చిత్రం నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. విక్రమ్‌కృష్ణ మాట్లాడుతూ విశాల్‌కు సరిపోయే కథకోసం చూశామని, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ దొరకడంతో నవంబర్‌లో షూటింగ్‌కు వెళ్లనున్నామని, మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: విక్రమ్ కృష్ణ, కథ, దర్శకత్వం: శశికాంత్.

  ప్రస్తుతం అర్జున్ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ కడల్. ఇన్నాళ్లూ హీరోగా తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన అర్జున్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తర్ఫీదు సైతం పొందినట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా తమిళ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. రాధ రెండో కుమార్తె హీరోయిన్ గా చేస్తోంది. రామేశ్వరం మత్స్య కారుల కుటుంబాల బ్యాక్ డ్రాప్ తో సాగే ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక అర్జున్ పాత్ర విషయానికి వస్తే మంగాత్తా చిత్రంలో అజిత్ పాత్ర తరహాలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ అందించనున్నారు. ఈ విషయమై అర్జున్ మాట్లాడుతూ..మణిసార్ చిత్రంలో ఆఫర్ రావటం తన అదృష్టమన్నారు.

  అలాగే అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'జైహింద్‌'. ఆయనే స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో తమిళం, తెలుగులో మంచి విజయం సాధించింది. విధ్వంసాలకు పాల్పడుతున్న తీవ్రవాదుల ఆట కట్టించే పోలీసు అధికారిగా అర్జున్‌ అందులో కనిపించారు. 1993లో వచ్చిన ఆ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్‌ రూపుదిద్దుకోనుంది. ఈ సీక్వెల్ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలింస్‌ రవిచంద్రన్‌ నిర్మించనున్నారు. హీరోగా నటించడంతోపాటు దర్శకత్వ బాధ్యత కూడా అర్జునే తీసుకోనున్నారు. తీవ్రవాద ఇతివృత్తాన్నే తీసుకుని.. ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించేలా దీన్ని తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్‌ సమాచారం.

  English summary
  Arjun is set to pass his legacy to his daughter, although we do not expect the action part to follow! Iswarya is her name, and she is all set to come in front of the camera in the lead role of a movie opposite star actor Vishal titled ‘Pattathu Yanai’. The movie is set to begin filming very soon. She will be playing the role of a girl studying 12th Standard but in reality, Iswarya is completing coursework in the field of visual communication. The production team will film its first scene on the 5th of November.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X