»   » సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్

సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ 1970 లో చేసిన సూపర్ మ్యాన్ పాత్రను తాజాగా యాక్షన్ కింగ్ గా పేరుపడ్డ అర్జున్ పోషించనున్నారు. ఎ వెంకటేష్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ కె ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. హరి ప్రియ హీరోయిన్ గా చేస్తోంది. ఇక అర్జున్ సూపర్ మ్యాన్ రోల్ కోసం మేకప్,కాస్ట్యూమ్ వంటి విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక సూపర్ మ్యాన్ ని పోలిన పాత్రను ఆ మధ్య హృతిక్ రోషన్ హిందీలో క్రిష్ పేరుతో చేసి హిట్ కొట్టారు. అలాగే తమిళ దర్శకుడు ధరణి...రామ్ చరణ్ తేజ కి చెప్పిన కథ కూడా సూపర్ మ్యాన్ తరహాదే అని వినిపించింది. ఇక సూపర్ మ్యాన్ వంటి సినిమాలు ఎక్కువగా పిల్లలను, పిల్లలలాంటి మనస్సున్న పెద్దలను టార్గెట్ చేస్తారు..కాబట్టి స్క్రిప్టు విషయంలో ఆ ఎలిమెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తేనే బావుంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X