»   » 'తుఫాన్' : పోస్టర్స్ దగ్దం, అడ్డుకుంటామని హెచ్చరిక

'తుఫాన్' : పోస్టర్స్ దగ్దం, అడ్డుకుంటామని హెచ్చరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజామాబాద్ : కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, నటుడు రాంచరణ్ నటించిన 'తుఫాన్'(తెలుగు)సినిమాను అడ్డుకుని తీరుతామని విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సామాజిక తెలంగాణ అంటూ ప్రజల వద్దకు వచ్చిన చిరంజీవి తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా మారిన చిరంజీవి కుటుంబ సభ్యులు నటించే సినిమాలను అడ్డుకుంటామన్నారు. తుఫాన్ సినిమా తెలంగాణలో విడుదల కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే తెలంగాణ ప్రజల డబ్బుతో ఈ రోజు ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగిన చిరంజీవి తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతూ, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలు విడుదలైతే తెలంగాణలో ఆ సిని మా ప్రదర్శనలు అడ్డుకుంటామన్నారు.

ఈ నెల 6న విడుదల అవుతున్న తుఫాన్ సినిమాను జిల్లాలోని అన్ని థియేటర్ల వద్ద విద్యార్థి జేఏసీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. రాంచరణ్ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అడ్డుకుంటామన్నారు. నైజాం కలెక్షన్‌లతో పైకి వచ్చిన చిరంజీవికి అదే ప్రాంతంలో పాతర వేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్షికమంలో విద్యార్థి జేఏసీ నాయకులు ప్రగతి, మర్రికిరణ్, సాయి, లక్ష్మణ్, ప్రశాంత్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

మరో ప్రక్క 'తుఫాన్' చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ 'రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. రాంచరణ్, ప్రియాంకచోప్రా ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాను తెలుగులో 'తుఫాన్'గా, హిందీలో 'జంజీర్'గా నిర్మించి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని పిటిషనర్ తెలిపారు.

విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకొంటామని కొన్ని చోట్ల ఆందోళనకారులు ప్రకటనలు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చా రు. ఇదే జరిగితే తాము కోలుకోని విధంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. తమ సంస్థ నిర్మించిన ఈ చిత్రాల ప్రదర్శన కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు.


'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురుకానున్నాయని వచ్చిన వార్తలను రామ్ చరణ్ తోసిపుచ్చాడు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న మాట వాస్తమే అయినా తమ చిత్రం విడుదలకు ఎటువంటి అడ్డంకులు ఉండబోమని ఆశాభావం వ్యక్తం చేశాడు.

English summary
Activists in Nizamabad have burnt the posters of Thoofan and demanded that Chiranjeevi withdraw his support from the Samaikandhra agitation. Situations are similar in Venkatagiri in Nellore district. Samaikandhra activist have burnt posters here too and have asked that Chiranjeevi resign from his ministerial post and join the agitation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu