»   » డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రముఖ నటుడి కుమారుడు, అరెస్ట్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రముఖ నటుడి కుమారుడు, అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీలు పట్టుబడటం కామన్ అయ్యిపోయింది. తాజాగా ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ కుమారుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుపడ్డాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అలోక్‌నాథ్‌ కుమారుడు శివాంగ్‌నాథ్‌, ఓ ప్రెండ్ బర్తడే పార్టీకి వెళ్లి మిగిలిన స్నేహితులతో కలిసి తిరిగి వస్తుండగా పట్టుబడ్డారు.

Actor Alok Nath's Son Caught Drink Driving

వేగంగా వెళ్తున్నా అతన్ని , ట్రాఫిక్‌ పోలీసులు అతడి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు కారు ఆపకుండా ఇంకా వేగాన్ని పెంచి, పారిపోవాలని ప్రయత్నించాడు. శాంతాక్రజ్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.శివాంగ్‌ వద్ద కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. అయితే అతడి వెంట వున్న మహిళా స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తామే వాహనాన్ని నడిపామని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం బాంద్రా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు, పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అశోక్‌ దుదే తెలిపారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి, జరిమానా రూ.2,600 విధించినట్లుగా తెలిపారు.

English summary
Actor Alok Nath's son Shivang was caught drink driving on Monday night after a chase on the streets of Mumbai. Shivang Nath has been fined Rs. 2,600 and is car has been impounded.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu