»   »  రజనీ, కమల్ పై నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. వారికంటే శింబు చాలా బెటర్!

రజనీ, కమల్ పై నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. వారికంటే శింబు చాలా బెటర్!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి కన్నడ సీనియర్ నటుడు అనంత నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రజని కాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో తాను చాలా ఊహించుకున్నానని అనంత నాగ్ తెలిపారు. కావేరి నది జలాల విషయంలో కమల్ హాసన్, రజనీకాంత్ కర్ణాటక ప్రభుత్వం పై మండి పడిన సంగతి తెలిసిందే. రజని, కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరుణంలో వారినుంచి తాను చాలా ఆశించానని అనంత నాగ్ అన్నారు.

కానీ వారిద్దరూ పాత ధోరణిలోనే రాజకీయాలు చేస్తున్నట్లు అనిపిస్తోందని చురకలు అంటించారు. కర్ణాటకలో ఎన్నికల సమయం నడుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరగవు. అయినా కూడా ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని అనంత నాగ్ ప్రశ్నించారు. రజని, కమల్ కన్నా నటుడు శింబు పరిణితో వ్యవహరించి మాట్లాడాడని అన్నారు. ఎలాంటి పోరాటం లేకుండా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వాలని శింబు వినమ్రంగా విజ్ఞప్తి చేసారు.

Actor Ananth Nag Controversial comments on Rajinikanth and Kamal Haasan

ఇలాటి పరిస్థితుల్లో అలాంటి ధోరణి అవసరం అని అనంత నాగ్ అన్నారు. శింబు ప్రదర్శించిన పరిణితి రజని, కమల్ చూపక పోవడం తనని విస్మయానికి గురిచేసిందని అనంత నాగ్ అన్నారు. ఆఫ్రికాలోని నైలు నది సమస్య పరిష్కారం అయింది. అలాంటి పరిష్కారం ఇక్కడ కూడా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Actor Ananth Nag Controversial comments on Rajinikanth and Kamal Haasan. He praises Shimbu over Kaveri issue
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X