twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సమయంలో చచ్చిపోవాలని అనుకొన్నా.. దర్శకుడు ఈవీవీతోనే పునర్జన్మ.. బాబూమోహన్

    మామూలు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన బాబూ మోహన్ జీవితాన్ని కూడా విషాదం వెంటాడింది.

    By Rajababu
    |

    ఎవరైనా సరే సుఖాలతోపాటు కష్టాలు కూడా వెంటాడుతుంటాయి. అందుకు సినీతారలు మినహాయింపేమీ కాదు. మామూలు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన బాబూ మోహన్ జీవితాన్ని కూడా విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తన పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొందామని అనుకొన్నానని సినీ నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాధను పంచుకొన్నారు.

    కుమారుడి మరణం తట్టుకోలేక..

    కుమారుడి మరణం తట్టుకోలేక..

    ‘నా పెద్ద కుమారుడి మరణంతో తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నేను ఆత్మహత్య చేసుకొందామనేంత వరకు వెళ్లాను. త్వరగా చనిపోతే పరలోకంలో ఉన్న నా కుమారుడితో ఆడుకోవచ్చని అనుకొన్నాను. అలాంటి ఆలోచనలతో మదనపడుతుండగా.. ఓ రోజు నాకు ఏమనిపించిందంటే.. సినీ పరిశ్రమ, రాజకీయాల ద్వారా ఎంతో మందికి సేవచేశాను. నేను ఎందుకు చనిపోవాలి అనిపించింది. అందుకే ఆ తీవ్ర ప్రయత్నం నుంచి బయటపడ్డాను అని బాబూమోహన్ అన్నారు.

    దుర్భరంగా జీవితం..

    దుర్భరంగా జీవితం..

    నా కుమారుడు చనిపోయిన తర్వాత జీవితం చాలా దుర్భరంగా మారింది. చాలా రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. నెలల తరబడి వేసిన గది తలుపులు అలాగే ఉండేవి. గదిలో కూర్చొని ఏడ్చేవాడిని.
    ఆ విషాదంతో ఇంటిని, నా జీవితాన్ని చీకట్లు కమ్ముకున్నాయి. ఇంట్లో లైట్లు కూడా వెలిగించే వాళ్లం కాదు. అలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి కారణం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కారణమని బాబూమోహన్ తెలిపారు.

    ఈవీవీ వల్లే మళ్లీ మామూలుగా

    ఈవీవీ వల్లే మళ్లీ మామూలుగా

    నేను చాలా విషాదంలో ఉన్నప్పుడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చేసిన మేలు మరువలేను. మరో జన్మను ప్రసాదించారు. ఆ సమయంలో ఈవీవీగారు నన్ను పరామర్శించారు. నా పరిస్థితి చూసి ఆయన కూడా ఫీలయ్యారు. అప్పుడే ఎవడిగోల వాడిది షూటింగ్ ఉంది. బ్యాంకాక్ వెళ్తాం. రెండు నెలలు ఉండి వద్దా అని సినిమా అవకాశం ఇచ్చారు. దాంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను అని బాబూమోహన్ తన అనుభవాలను చెప్పుకొన్నాడు.

    ఈవీవే కారణం..

    ఈవీవే కారణం..

    బ్యాంకాక్‌లో ఎవడిగోల వాడిది షూటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్ అయ్యేది. ఆ తర్వాత నన్ను తీసుకొని బయటకు వెళ్లావారు ఈవీవీ. మసాజ్, ఫుడ్ తిని ఎంజాయ్ చేశాం. ఆ విషాదం నుంచి బయటపడ్డాను. అలా బ్యాంకాక్‌లో 45 రోజులు సరదాగా గడిచిపోయాయి. దాంతో విషాదం నుంచి మామూలు మనిషిగా మారిపోయాను. జీవితంలో మళ్లీ ఇలా ఉన్నానంటే ఈవీవీ గారే కారణం అని బాబూమోహన్ అన్నారు.

    మనవరాలి రాకతో మళ్లీ..

    మనవరాలి రాకతో మళ్లీ..

    మళ్లీ సాధారణ జీవితం గడపటం అలవాటు చేసుకొన్న తర్వాత నా చిన్న కొడుకుకి పెళ్లి చేశాను. నేను షూటింగ్‌లతో బిజీ అయిపోయాను. డిప్రెషన్‌ కారణంగా నా నియోజకవర్గానికి వెళ్లలేదు. మళ్లీ జనాల్లోకి వెళ్లాలనుకున్నాను. నామినేషన్‌ వేయటానికి వెళ్లాను. పోటీకి నిల్చున్న ప్రత్యర్థి అందరినీ కొనేయడంతో నాకు ఓటమి తప్పలేదు. ఆ సమయంలోనే నా చిన్నకుమారుడికి కూతురు పుట్టడం మా ఇంట్లోకి మనమరాలు వచ్చింది. మనవరాళి రాకతో జీవితం అద్భుతంగా మారింది. మనవరాలి కేకలతో సందడిగా మారింది. అందరూ ముఖాల్లో సంతోషం కనిపించింది అని బాబూమోహన్ తెలిపారు.

    English summary
    Actor Babu Mohan Shares his life experiences with media recently. After his son death, he goes into deep depression. Babu mohan wants to attempt suicide. In that critical situation director EVV Satyanarayana saved his life giving Evadigola Vadide movie offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X