For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Babu Mohan : సొంతూళ్ళో నాలుగు ఓట్లు రాలా..అంత వ్యామోహం ఎందుకు? ప్రకాష్ రాజ్ మీద సంచలనం

  |

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న యంగ్ హీరో మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించగా ఆ ప్రెస్ మీట్ లో ప్రత్యర్థి ప్యానల్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా బాబు మోహన్ ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసి సంచలనం రేపారు. ఆ వివరాల్లోకి వెళితే

  రంగంలోకి విష్ణు

  రంగంలోకి విష్ణు

  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల వేడి ఎప్పటి నుంచో మొదలయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించి మరీ రంగంలోకి దిగగా చాలా లేటుగా ప్యానల్ ను ప్రకటించిన మంచు విష్ణు ఇప్పుడు ప్రచారంలో భాగంగా తన ప్యానెల్‌ సభ్యులు అందరితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

  ఆ ధైర్యంతోనే

  ఆ ధైర్యంతోనే

  ఇక ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మార్పు తీసుకురాగలననే ధైర్యంతోనే ఇప్పుడు వస్తున్నానని ‘మా'లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉందని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారని తన సొంత బ్యానర్‌లోనూ పని చేశారు, డబ్బులు తీసుకున్నారని అన్నారు. ఇక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటా కానీ ‘మా అసోసియేషన్‌లో నాకన్నా బాగా పనిచేయలేరు' అంటూ చెప్పుకొచ్చారు.

  ఛారిటీ అని ఎలా అంటారు?

  ఛారిటీ అని ఎలా అంటారు?

  ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ గురించి మాట్లాడుతూ వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, వాళ్ల ప్రసంగాలు విన్నా. వాళ్లు చెప్పింది 99శాతం నేను ఆమోదించనని అన్నారు. తినడానికే సగం మందికి తిండి లేదన్న ఆయన రెస్టారెంట్‌కు డిస్కౌంట్‌లో ఎలా తినగలుగుతారు? అని ప్రశ్నించారు. ‘మా' ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదన్న విష్ణు, పెద్దలకు పింఛన్‌ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత అని అన్నారు. ఇక డబ్బున్న వాడికీ, లేని వాడికీ కరోనా స్పష్టత ఇచ్చింది'' అని మంచు విష్ణు ఘాటు కామెంట్స్ చేశారు.

  ముచ్చటేసేది కానీ

  ముచ్చటేసేది కానీ


  ఇక ఆయన తర్వాత మాట్లాడిన బాబు మోహన్ ఒకప్పుడు ‘మా'ని చూస్తే ముచ్చటేసేది కానీ రెండు మూడు టెర్మ్‌లు చూస్తే కరోనా వచ్చినట్టే వచ్చిందని ఘాటు కామెంట్స్ చేశారు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందని అనుకుంటున్న టైంలో ఎవరివల్ల అయితే ఈ ఇండస్ట్రీకి పేరు వచ్చిందో వాళ్లని పక్కన పెట్టి.. ఈ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతుండటం బాధాకరంగా ఉందని, నీలాంటి వాళ్లని ఎంతో మందిని ఈ ఇండస్ట్రీ పుట్టిస్తుందని, కళామ్మ తల్లికి సేవ చేయాలనుకుంటే చేయాలి కానీ.. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

  విడతీయడం నచ్చలేదు

  విడతీయడం నచ్చలేదు

  ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ఆయన మా గురించి స్టడీ చేశాను అన్నాడు అని అక్కడ ఉన్నది అంత మంది కాదు, ఇంత మంది కాదు 150 మంది లోకల్ కాదని అంటున్నాడని అలాగే వాళ్ళు ముందుకు రారు వీళ్లు ఓట్లు వేయరు వీళ్ళు పనికి వస్తారు వాళ్ళు పనికిరారు అని ఏదేదో మాట్లాడుతున్నాడు అని అసలు ఇండస్ట్రీ అన్నాక పనికి రాని వాడు ఉంటాడా అని బాబు మోహన్ ప్రశ్నించారు. ఇలా విడదీసి మాట్లాడటం తనకు బాధ కలిగించిందని పేర్కొన్న బాబు మోహన్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకురావాలి అనుకునేవాడు కళామతల్లి ముద్దుబిడ్డ కానే కాదని అన్నారు.

  అంత వ్యామోహం ఎందుకు?

  అంత వ్యామోహం ఎందుకు?

  ఒకప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ అప్పటికే ఉన్న వాళ్ళు చాలా గొడవలు పడ్డారని తర్వాత అందరూ కలిసి పని చేస్తున్న టైంలో ఇండస్ట్రీ పెద్దలు అండగా నిలిచారని అన్నారు. అంతేకాక కరోనా సమయంలో సినిమాలు లేక షూటింగులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే అసలు మా ప్రెసిడెంట్ ఎన్నికలు ఎప్పుడో సెప్టెంబర్ లో ఉంటే ఏప్రిల్ లో లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ? పదవి అంటే అంత వ్యామోహం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

  నాలుగు ఓట్లు కూడా రాలే

  నాలుగు ఓట్లు కూడా రాలే


  అలా ఆ ప్యానల్ లో ఒకరు ఉన్నారు వాళ్ళ సొంత ఊరిలో పోటీ చేస్తే నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ పోటీ చేస్తే నువ్వు మా వాడిని కాదు పో అన్నారు, అలాంటి వారు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. అయితే గతంలో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్ధిగా ఎంపీ పదవికి పోటీ చేయగా ఆయనకు దారుమైన ఓటింగ్ వచ్చింది. బహుశా బాబు మోహన్ ఆయననే ఉద్దేశించి మాట్లాడి ఉండచ్చని అంటున్నారు.

  మోహన్ బాబు ఫోన్ తో

  మోహన్ బాబు ఫోన్ తో

  ఇక తనకు ఆసక్తి లేదు అన్నా సరే మోహన్ బాబు గారు ఫోన్ చేసి 'మా' కోసం పని చెయ్యమని అడిగారని నాకు వద్దన్నా అని అన్నా సరే మంచు విష్ణు రంగంలోకి దిగుతున్నాడు అని చెప్పి నన్ను కూడా రంగంలోకి దిగమని అడిగారని అన్నారు. అలాగే హీరోలంతా ఫ్రీ గా చేస్తానన్నారు అని, సినిమాలు తీసి డబ్బులు తెచ్చి ఏదో చేస్తానని ఆయన అంటున్నాడు అని కానీ ఏమీ లేకుండా చేయొచ్చు ముందు బుర్రని మంచి పనులకు వాడండి అంటూ ఆయన సలహా ఇచ్చారు.

  English summary
  Actor Babu Mohan made sensational comments On Prakash Raj Over Maa Elections row.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X