»   »  అక్రమ సంబంధం‌: పారిపోబోతూ పడి తెలుగు నటుడు మృతి

అక్రమ సంబంధం‌: పారిపోబోతూ పడి తెలుగు నటుడు మృతి

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో అపార్టుమెంట్‌ పైనుంచి పడి నటుడు బాలప్రశాంత్‌ మృతి చెందారు. ఆరు అంతస్తుల భవనం పైనుంచి జారిపడిన బాలప్రశాంత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 'ఇప్పట్లో రాముడిలా... సీతలా ఎవరుంటారండి బాబు' అనే సినిమాలో బాలప్రశాంత్‌ నటించారు. అయితే ఈ దుర్మరణానికి కారణం అక్రమ సంభంధం అని తేలటం దురదృష్టం. పూర్తి వివరాల్లోకి వెళితే...

మూసాపేట ఆంజనేయనగర్‌లో నివాసం ఉంటున్న బాలప్రశాంత్ (20) 'ఇప్పట్లో రాముడిలా... సీతలా ఎవరుంటారండి బాబు' సినిమా హీరోగా నటిస్తున్నాడు. అయితే తన ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ఒకామెతో అక్రమ సంభందం పెట్టుకన్నాడు. శుక్రవారం తన ప్రియురాలి భర్త లేకపోవడంతో ఆమె ఇంట్లోకి వెళ్లాడు. అయితే ఒక్కసారిగా బంధువులు రావడంతో భయాందోళనకు గురైన ప్రియురాలు అతన్ని ఇంట్లోనే దాచిపెట్టింది.

bala prasanth

తన ఇంట్లో ఎవరూ లేరని, నిద్రపోతానని చెప్పి బంధువులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన బంధువులు తనిఖీ చేస్తుండగా.. ప్రియురాలు చేతులు కోసుకొని గలాటా సృష్టించింది. దీంతో బంధువులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ ఇంటికి తాళం వేశారు.

ఇంట్లోనే ఉన్న బాలప్రశాంత్ ఇంటి వెనకాల ఉన్న పైప్‌ల ద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రశాంత్ స్వస్థలం గుంతకల్లుకు తరలించారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి.

ప్రశాంత్ తల్లిదండ్రులు అనంతపురం జిల్లాకు చెందిన సౌందరరాజు, గ్లోరీలు. కొన్నేళ్ల క్రితం తండ్రి మరణించారు. ప్రశాంత్.. జ్యోతిలక్ష్మి చిత్రంతోపాటు మూడు షార్ట్ ఫిలింలలో నటించాడు. ప్రశాంత్ నటించిన సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగడం తమను కలచివేసిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

English summary
Bala Prashant, 25, was attempting to climb down a pipe from the fifth floor when he fell to his death. Prashant had played the lead in Ippatlo Ramu-dila Seethala Evaruntaa-randi Babu, which is yet to be released.
Please Wait while comments are loading...