»   » సినిమా ఓ అందమైన అబద్ధం.. గల్ఫ్ చిత్రం ఓ నిజం అంటున్న భద్రం (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

సినిమా ఓ అందమైన అబద్ధం.. గల్ఫ్ చిత్రం ఓ నిజం అంటున్న భద్రం (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gulf Movie Official Trailer గల్ఫ్ సినిమా ట్రైలర్

జ్యోతిలక్ష్మి, భలే భలే మొగాడివోయ్ చిత్రాల్లో ప్రత్యేకమైన, తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన నటుడు భద్రం. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ అయినప్పటికీ నటుడిగా కూడా ప్రేక్షకులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాడు. తాజా ఆయన నటిస్తున్న చిత్రం గల్ఫ్, బాలకృష్ణ 102వ సినిమా, వీవీ వినాయక్, సాయి ధరమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాల్లో నటిస్తున్నాడు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో, పులగం చిన్నారాయణ మాటలు సమకూర్చిన గల్ఫ్‌ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్యనటుడు భద్రం తెలుగు ఫిల్మీబీట్.కామ్ (telugu.filmibeat.com)తో ప్రత్యేకంగా మాట్లాడారు. గల్ఫ్ సినిమా గురించి నటుడు భద్రం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 గల్ఫ్ సినిమా వరకు వస్తే నిజం

గల్ఫ్ సినిమా వరకు వస్తే నిజం

సినిమా అనేది అందమైన అబద్ధం. గల్ఫ్ సినిమా వరకు వస్తే నిజం. వాస్తవ జీవితం. సినిమాకు ముందు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చాలా గల్ఫ్‌లో చోటుచేసుకొన్న విషాదాల గురించి చెప్పారు. పొట్ట చేతపట్టుకొని ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లి చనిపోయేవారి గురించి చెప్పినప్పుడు కళ్లు చెమర్చాయి. గల్ఫ్ బాధితుల కష్టాలు విన్న తర్వాత గుండె తరుక్కుపోయింది.

 సునీల్ కుమార్ రెడ్డి పరిశోధన అమోఘం

సునీల్ కుమార్ రెడ్డి పరిశోధన అమోఘం

సాధారణంగా చాలా మంది సినీ దర్శకులు, రచయితలు ఊటీకో లేదా మరో ఇతర ప్రదేశానికి వెళ్లి సినిమా కథలు రాసుకొంటారు. కానీ గల్ఫ్ సినిమా కోసం దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చేసిన పరిశోధన అమోఘం. దాదాపు గల్ప్ దేశాల్లో తిరిగి సుమారు 400 వందల సంఖ్యలో పరిశోధనలు చేశాడు.

 కార్మికుల వెతలు, బాధలకు తెరరూపమే గల్ఫ్

కార్మికుల వెతలు, బాధలకు తెరరూపమే గల్ఫ్

విదేశాల్లో భారతీయ కార్మికుల వెతలు, బాధలకు తెరరూపమే గల్ఫ్ చిత్రం. గల్ఫ్ బాధితుల ఘటనలను చెప్పడానికి రెండు గంటలు సరిపోదు. అలాంటి సంఘటనలకు ఓ ప్రేమ కథను జోడించి గల్ఫ్ అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి.

 తెరపైన బంగార్రాజుగా

తెరపైన బంగార్రాజుగా

గల్ఫ్ చిత్రంలో నా పాత్ర పేరు బంగార్రాజు. బాగా డబ్బు సంపాదించి తాను ప్రేమించిన మరదలిని పెళ్లి చేసుకోవడానికి గల్ఫ్‌లో ఉద్యోగం కోసం వెళుతాడు. ఆ తర్వాత గల్ఫ్‌లో బంగార్రాజు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరికి మరదలిని పెళ్లి చేసుకొన్నాడా అనేది పాత్రకు సంబంధించిన విషయం. హీరో ప్రేమకథకు సమాంతరంగా నా ప్రేమకథ కూడా కొనసాగుతుంది.

 సునీల్ కుమార్ రెడ్డి తమిళంలో

సునీల్ కుమార్ రెడ్డి తమిళంలో

గల్ఫ్ సినిమా తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. ఈ సినిమా కోసం దాదాపు వారంపాటు పనిచేశాను. షూటింగ్ కోసం నేను తొలిసారి సెట్లోకి వెళ్లిన సమయంలో తమిళంలో సినిమాను షూట్ చేస్తున్నారు. సెట్లో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తమిళంలో అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన బేసిక్‌గా తమిళుడని అనుకొన్నాను. ఆ తర్వాత మలయాళంలో షూట్ చేశారు. అప్పుడు మలయాళంలో అనర్గళంగా మాట్లాడుతుంటే ఈయన మలయాళీయా అనే సందేహం మళ్లీ కలిగింది.

 బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

గల్ఫ్‌ సినిమాకు పనిచేసిన తర్వాత నాకు తెలిసింది దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. సమాజంలోని అన్ని అంశాల మీద మంచి పట్టు ఉంది. సినిమా ద్వారా సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలని తపన పడుతుంటాడు. ఆరు పాటలు, ఫైట్లు లాంటి ఫార్మూలా సినిమా తీస్తామనే ఆలోచన ఆయనలో కనిపించదు.

English summary
Actor Bhadram is familar with movies like Jyothilakshmi, Bhale Bhale Mogadivoy. Now Bhadram is doing Gulf movie, which releasing on October 13th. This movie directed by P Sunil Kumar Reddy. In this occassion, He speaks to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu