»   » వాఘాలో సైనికులతో...., రకుల్ ప్రీత్ వల్లే ఆమెకి థాంక్స్: బ్రహ్మాజీ

వాఘాలో సైనికులతో...., రకుల్ ప్రీత్ వల్లే ఆమెకి థాంక్స్: బ్రహ్మాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పొరుగుదేశం పాకిస్తాన్‌తో భారత్‌ సంబంధాలు ఈమధ్య మరింత బలహీనపడ్డాయి. ఇటీవల యుద్ధం దిశగా రెండు దేశాలూ అడుగులు కూడా వేశాయి. ఇక, భారత్‌-పాక్‌ బోర్డర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తం. ఇలాంటి సమయంలో భారత్‌-పాక్‌ బోర్డర్‌కు వెళ్లి అద్భుతమైన అనుభవంపొందాను అంటూ చెప్పాడు బ్రహ్మాజీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ తనకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పాడు

Actor Brahmaji at Wagah Border

తనకు ఎంత ఇష్టమో తన భార్యకు కూడా అంతే ఇష్టం కావడంతో... ఇద్దరం కలిసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటామని, నేను సంపాదించిన మొత్తంలో ఎక్కువగా ఖర్చు పెట్టింది దీనికేనని, ఈ మొత్తం వెనుకేసుంటే ఆర్ధికంగా నేను చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాడినని, పిల్లలకు ఉంటానికి ఇల్లు, చదువు, కడుపు నిండా తిండి తప్ప ఎలాంటి ఆస్తులు ఇవ్వనవసరంలేదు, మిగిలిన వాటితో మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ తన ప్రయాణాభిలాషని బయట పెటాడు.

'వాగా నుంచి ఈ ఫోటో. ఎంతో అద్భుతమైన అనుభవం. థాంక్యూ రకుల్ ప్రీత్.. ఇండికా పాకిస్తాన్ బోర్డర్ ను సందర్శించేందుకు డాడీ వీఐపీ పాస్ ఏర్పాటు చేశారు' అంటూ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి మాజీ ఆర్మీ ఆఫీసర్. అందుకే ఆయనకు ఇలా పాస్ లకు అనుమతి పొందేందుకు సహహకరించగలిగారన్న మాట. అలా రకుల్ ప్రీత్ సాయంతో..

బ్రహ్మాజీ ఇండియా-పాక్ బోర్డర్ ను చుట్టేశాడు.ఇండియాలో ఉన్న పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి.. పాక్ లో ఉన్న పంజాబ్ లోని లాహోర్ వరకు రోడ్ రూట్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వాజ్ పేయి హయాంలో బస్ కూడా నడిపారు కూడా.. ఇప్పుడు అనుమతులు లేవు. ఈ రహదారిలో సరిహద్దు ప్రాంతమే వాగా. బ్రహ్మాజీ అక్కడి వరకూ వెళ్లాడు. అదీ సంగతి.

English summary
Telugu actor Brahmaji posted a photo from indo-pak Wagha border, says thanks to Rakul preeth singh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu