»   » నన్ను చరిత్ర హీనుడిగా మార్చారు, మీరూ బాధ్యులే : చలపతి రావు బహిరంగ లేఖ

నన్ను చరిత్ర హీనుడిగా మార్చారు, మీరూ బాధ్యులే : చలపతి రావు బహిరంగ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో ఆడవాళ్లను ఉద్దేశించి చలపతిరావు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు ఆయనపై కేసు కూడా పెట్టారు.

అయితే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ ఆయన బహిరంగ లేఖ రాసారు. ఈ వయసులో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని పశ్చాత్తాప పడ్డారు. లేఖలో ఆయన ఇంకా ఈ విషయాలు రాసారు.

చరిత్ర హీనుడిగా మార్చారు

చరిత్ర హీనుడిగా మార్చారు

‘డబ్భై మూడేళ్ల వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య, దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది.‘ఆడవాళ్లతో హానికరమా' దానికి జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు'. ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేసిన పరిస్థితి.... అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఎలాంటి షరతు లేకుండా క్షమాపణ

ఎలాంటి షరతు లేకుండా క్షమాపణ

నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చేయకుండా ఉండాల్సింది. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతున్నాను.... అని చలపతి తెలిపారు.

నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే

నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే

ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరాఖరికి, ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో, మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్య శ్రవణాలకు మనందరం బాధ్యలమే! పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా! ఆ విషయం మనందరికీ తెలుసు. నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పేమాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి... అని చలపతి వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

ఇకముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు. నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ, మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. మన్నించండి!
మీ
చలపతిరావు'
అని ఆ లేఖలో పేర్కొన్నారు.

English summary
Actor Chalapathi Rao's Open Letter On Controversial Comments. Check out full details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu