Don't Miss!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
విడాకులు ఇచ్చినా ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వని ధనుష్.. మొదటిసారి అలా బాధ్యతగా.. ఫొటో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల విడాకుల వార్తలతో అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో 18 ఏళ్ళ దాంపత్య జీవితానికి ముగింపు కార్డ్ వేసిన ఈ హీరో విడాకుల విషయాన్ని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక చాలా రోజుల అనంతరం ఒక ఫ్యామిలీ బాండింగ్ పిక్ తో దర్శనమిచ్చాడు. తండ్రిగా తన బాధ్యతను మర్చిపోలేదు అని ఒక ఫొటోతో చెప్పకనే చెప్పేశాడు.

టాలెంటెట్ హీరోగా
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్స్ చాలామంది ఉన్నారు. ఇక టాలెంటెట్ హీరోల లిస్టులో ధనుష్ టాప్ లో ఉంటాడు అని చెప్పవచ్చు. తన మార్కెట్ తో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్న ధనుష్ పాత్రలతో ఎలాంటి ప్రయోగం చేయడానికైనా సిద్ధపడతాడు.

మంచి భర్తగా..
అయితే చాలా కాలంగా మంచి నటుడిగానే కాకుండా మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా గుర్తింపు అందుకుంటున్న ధనుష్ ఊహించని విధంగా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఈవెంట్ లో రజనీకాంత్ కూడా ధనుష్ మంచి నటుడే కాదని మంచి భర్త, మంచి తండ్రి అంటూ ఎంతగానో ప్రశంసించారు.

పిల్లల కోసం..
అయితే ధనుష్, ఐశ్వర్యకు మధ్యలో గతకొంత కాలంగా విబేధాలు రావడంతో ఫైనల్ గా విడాకులు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారి కోసం అయినా మళ్ళీ ఒకసారి ఆలోచించాలని చాలామంది పెద్దలు సూచించారట. కానీ వారు ఆ విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.

తండ్రి బాధ్యతను..
ఇక ధనుష్ భర్తగా ఐశ్వర్యకు దూరం అయినప్పటికీ తన తండ్రి బాధ్యతను మాత్రం మార్చిపోవడం లేదని తెలుస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు యాత్ర (16), లింగా(12). ఇక రీసెంట్ గా ధనుష్ తన పెద్ద కొడుకు యాత్రతో కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్య కూడా
ధనుష్ దాంపత్య జీవితానికి ముగింపు కార్డు వేసినప్పటికి తన తండ్రి స్థానాన్ని మాత్రం మారువడం లేదు. వీలైనంత వరకు తన పిల్లలతో కాస్త ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. అలాగే ఐశ్వర్య కూడా పిల్లలతో కూడా ఎక్కువగా సమయాన్ని స్పెండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పిల్లల కోసం మళ్ళీ కలవమని చాలామంది సన్నిహితులు దనుష్ ఐశ్వర్యలకు చెబుతున్నారట. కానీ ఆ విషయంలో దంపతులు పెద్దగా ఆలోచించడం లేదని తెలుస్తోంది.

ధనుష్ రాబోయే సినిమాలు
ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన సోదరుడు సెల్వా రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వెంకీ అట్లూరితో సర్ అనే సినిమాను లాంచ్ చేశాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.