»   » ఎన్టీఆర్ వల్లే ఉన్నారు.. లేకుంటే ఆత్మహత్యే.. వాళ్లు టాయిలెట్ పోసుకున్నారు.. ధన్ రాజ్

ఎన్టీఆర్ వల్లే ఉన్నారు.. లేకుంటే ఆత్మహత్యే.. వాళ్లు టాయిలెట్ పోసుకున్నారు.. ధన్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జబర్దస్త్' షోతో క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ ధన్ రాజ్ తాజాగా బిగ్‌బాస్ షో తో విపరీతమై ఫాలోయింగ్ తెచ్చుకున్న విషయం తలిసిందే. బిగ్‌బాస్ షో విన్నర్ అవుతాడని అందరూ ఆలోచిస్తుండగా అనూహ్యంగా ఆయన షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధన్‌రాజ్ తొలిసారి యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌లో తనకు ఎదురైన అనుభవాలు తన సినీ కెరియర్ గురించి మాట్లాడాడు.

ఆ సినిమా వల్లే మిడిల్ క్లాస్ స్టేజ్‌కి వచ్చా..

ఆ సినిమా వల్లే మిడిల్ క్లాస్ స్టేజ్‌కి వచ్చా..

ధనలక్ష్మి తలుపు తడితే సినిమా తాను హీరొగా నటించి నిర్మించడం వల్ల చాలా డబ్బు పోగొట్టుకున్నానని మెరుగైన ఆర్ధిక పరిస్థితిలో ఉన్న తాను మిడిల్ క్లాస్ స్టేజ్‌కి వచ్చానని ధన్‌రాజ్ తెలిపాడు.

సంపూ కోసం తారక్ బ్రతిమిలాడాడు

సంపూ కోసం తారక్ బ్రతిమిలాడాడు

సంపూ బయటకు వచ్చేయగానే అతనికి పెనాల్టీ వెయ్యాలని నిర్ణయించారట అయితే సంపూ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులని బ్రతిమిలాడి తారక్ ఇప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్ట్ సంపూ అని అతనికి ఫైన్ పడకుండా చేశాడని ధన్‌రాజ్ చెప్పాడు.

మధ్యలో వెళ్లిపోతే పాతిక లక్షలు

మధ్యలో వెళ్లిపోతే పాతిక లక్షలు

బిగ్‌బాస్ షోకి వెళ్లేముందు ఒక అగ్రిమెంట్ ఉంటుందని దానిప్రకారం షో మధ్యలోంచి ఎలిమినేట్ అవ్వకుండా వెళ్లిపోతే పాతిక లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుందని ధన్‌రాజ్ తెలిపాడు.అలాగే తెలుగు ప్రేక్షకులు కొట్టుకుంటే... తిట్టుకుంటే బాగా చూస్తారని బిగ్‌బాస్ నిర్వాహకులు తనవద్దకు వచ్చినపుడు చెప్పానని ధన్ రాజ్ అన్నాడు.

ఎన్టీఆర్ వల్లే ఉన్నారు.. లేకుంటే ఆత్మహత్యే

ఎన్టీఆర్ వల్లే ఉన్నారు.. లేకుంటే ఆత్మహత్యే

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్టీఆర్ వల్లే ఉన్న వాళ్లందరూ ఉన్నారని లేకుంటే అందరూ ఆ డిప్రెషన్‌లో ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాళ్లని ఎన్టీఆర్ చెప్పే మాటలు అలా ఉంటాయని చెప్పాడు.బిగ్ బాస్ లో ఉండడం సెంట్రల్ జైల్‌లో ఉన్నట్లేనని జనాలు ఓట్లు వేసి జనం ఎలిమినేట్ చేసినపుడు రాష్ట్రపతి క్షమాబిక్ష పెట్టినట్టు ఉందని అనిపించిందని తెలిపాడు.

తారక్ అన్న వస్తాడనే ధైర్యం..

తారక్ అన్న వస్తాడనే ధైర్యం..

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక యుగంలా గడుస్తుందని వారం రోజులు నేను ఏం తప్పు చేయలేదని తారక్ అన్న నా కోసం వచ్చి ధైర్యం చెప్తాడని అందుకే నాకు భయం లేదనుకునేవాడినని చెప్పాడు.

వాళ్లిద్దరు టాయ్‌లెట్ పోశారు..

వాళ్లిద్దరు టాయ్‌లెట్ పోశారు..

బిగ్‌బాస్ హౌస్‌లో గుర్రం మీద ఊగే టాస్క్ ఆడుతున్నప్పుడు ప్రిన్స్, కల్పన ఇద్దరు టాయ్‌లెట్ పోసేశారని దాదాపు 8గంటల పాటు అలాగే టాస్క్ చేశారని కల్పన ఒంటి మీదే కక్కుకుందని దాంతో ఆమె దగ్గరికి ఎవ్వరూ రాలేదని అప్పుడు బాగా అస్యహించుకున్నారని ధన్‌రాజ్ అన్నారు. అయితే ఈ సంఘటన టీవీలో ప్రోగ్రాం వచ్చినప్పుడు ఈ ఘటనను ప్రేక్షకులకు చూపించలేదు.

English summary
Budding Comedian Dhanraj has entertained Bigboss show in his own style of comic and humour and stolen many hearts of viewers. after elimination from Bigboss, Dhanraj has revealed sensational things that went on in Bigboss house in a interview with a local channel. He is blessed with a baby boy on the elimination day which has excited him to come back to home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu