»   » సొంత అభిమానులే థూ..! అంటున్నారు: హీన స్థితిలో పీపుల్స్ స్టార్

సొంత అభిమానులే థూ..! అంటున్నారు: హీన స్థితిలో పీపుల్స్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనప్రియ నాయకన్‌... పీపుల్స్‌ హీరో... నిజ జీవితం లోనూ ఇలాంటి హీరో ఉండాలీ అనిపించుకున్న స్టార్ అతను, లక్షలాది అభిమానులు సినిమాల్లోనే కాదు నిజజీవితం లోనూ మా రోల్ మోడల్ అని చెప్పుకున్నారు, అమ్మాయిలు అతనికి రెండు పెళ్ళిల్లైనా అతన్ని తమ కలల్లోకి ఆహ్వానించారు.. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది ఆ హీరో వెనుక ఉన్న భయంకరమైన విలన్ ని చూసి అభిమానులే అసహ్యించుకుంటున్నారు.... అతని పేరు వింటే ఆగ్రహం తో ఊగిపోతున్నారు.. మళయాల పీపుల్స్ హీరో దిలీప్ ఫాల్ డౌన్ ఇంత దారుణం గా ఉంటుందీ అని అతనుకూడా ఊహించలేదేమో....

అభిమానులు కూడా అసహ్యించుకునేలా

అభిమానులు కూడా అసహ్యించుకునేలా

20 ఏళ్ల క్రితం కెరియర్ ప్రారంభించిన అతను అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఒక్క చిన్న తప్పు. అహం దెబ్బతిని ఆవేశంతో చేసిన తప్పు ఇప్పుడు అతన్ని అందరి ముందు ఒక దోషిగా నిలబెట్టింది. ఇంత కాలం అతని సినిమాలు వస్తే క్యూలు కట్టే అభిమానులు కూడా అసహ్యించుకునేలా చేసింది.

అభిమానుల ఆగ్రహం

అభిమానుల ఆగ్రహం

ఇంతకాలం అతని గురించి గొప్పగా అనుకున్న నటులు సైతం ఛీకొట్టేలా చేసింది. చివరికి అతన్ని మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా బహిష్కరించే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మలయాళ చిత్రసీమను కుదిపేసిన నటిపై అఘాయిత్యం కేసులో దిలీప్‌ ప్రమేయం ఉండటం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నది.

Dileep Arrested In Actress Abduction Case | Filmibeat Telugu
కొటేషన్‌ గ్యాంగ్‌

కొటేషన్‌ గ్యాంగ్‌

మలయాళ సినిమా రంగంలో ‘కొటేషన్‌ గ్యాంగ్‌' అనే కిరాయి గూండాల పద్ధతి నడుస్తుంటుంది. ఇది జగమెరిగిన సత్యం. సహ నటుడైన ముఖేశ్‌ దగ్గర ఏడాది పాటు డ్రైవర్‌గా పనిచేసిన చిల్లర నేరస్థుడు పల్సర్‌ సునీను దిలీప్‌ సంప్రతించారు. సదరు హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడి, అదంతా వీడియోలో బాహాటంగా చిత్రీకరిస్తే, రెండు కోట్ల దాకా ఇస్తానన్నారట.

మార్ఫ్‌ చేసిన వీడియో అని

మార్ఫ్‌ చేసిన వీడియో అని

పైగా, అది మార్ఫ్‌ చేసిన వీడియో అని ఆ హీరోయిన్‌ తరువాత చెప్పుకోవడానికి వీలు లేకుండా, నేరుగా, క్లోజప్పులో చిత్రీకరణ జరపాలని కూడా దుండగుడికి దిలీప్‌ చెప్పినట్లు పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం విశేషం. అలాగే, అప్పటికే నిశ్చితార్థమైన ఆ నటి తాలూకు ఉంగరం వేలు క్లోజప్‌ షాట్లు కూడా తీయాల్సిందిగా సునీకి దిలీప్‌ చెప్పారట.

దిలీప్‌ భార్య కావ్యా మాధవన్‌

దిలీప్‌ భార్య కావ్యా మాధవన్‌

పల్సర్‌ సునీ ఆ రోజు కారులో తాను తీసిన ఆ బాధిత నటి ఫోటోలు, వీడియో ఉన్న మెమరీ కార్డును కూడా దిలీప్‌ భార్య అయిన నటి కావ్యా మాధవన్‌ నడుపుతున్న ఆన్‌లైన్‌ సౌందర్యశాలలో డిపాజిట్‌ చేసినట్లు వెల్లడైంది. గతంలో ‘పల్సర్‌' సునీ ఓ ప్రముఖ నిర్మాత భార్యను ఇలాగే కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించినట్లు తాజాగా బయటకొచ్చింది.

కళాభవన్ మణి మరణం లో

కళాభవన్ మణి మరణం లో

ఈ విషయంలో కొంచం లోపలికి వెళ్తూంటే మరో దారునం దక్షిణాది నటుడు కళాభవన్ మణి అనుమానాస్పద మరణం విషయం లోనూ దిలీప్ ప్రమేయం ఉందంటూ వార్తలూ, అందులోనూ నిజం లేకపోలేదన్నట్టు గా కనిపిస్తున్న ఆధారాలూ దిలీప్ లోని అపరిచితున్ని అభిమానులకు కనిపించేలా చేసాయ్ తమ హీరో లోపల ఎంత భయకరమైన విలన్ ఉన్నాడో అర్థమైందన్న భావన లోకి ఆయనని విపరీతంగా అభిమానించిన వ్యక్తుల్లోకి కూడా బలంగా వెళ్ళిపోయింది.

జనప్రియ నాయకన్‌

జనప్రియ నాయకన్‌

ఒకప్పుడు జనప్రియ నాయకన్‌ (జనప్రియ నేత) అంటూ అభిమానంగా పిలిచిన వారే ఇప్పుడు దిలీప్‌పై మండిపడుతున్నారు. చివరికి ఆయన చివరి చిత్రమైన వెల్‌కం టు సెంట్రల్‌ జైలు అంటూ షాక్‌ ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతని మీద ఉన్న కోపాన్ని చూపిస్తున్నారు.

నటిపై లైంగిక వేధింపులు

నటిపై లైంగిక వేధింపులు

నటిపై కారులో లైంగిక వేధింపుల వెనుక దిలీప్‌ హస్తముందన్న వార్తలతో భగ్గుమంటున్న అభిమానులు ఇప్పటికే కొచ్చిలోని ఆయన రెస్టారెంట్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. జనం నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం నేపథ్యంలో తన వ్యాపారాలకు పోలీసు భద్రత కల్పించాలని దిలీప్‌ కోరారు.

దిలీప్ ఆస్థులకు భద్రత

దిలీప్ ఆస్థులకు భద్రత

అయితే దిలీప్ ఆస్థులకు భద్రత విషయం సరే ఆయన మీద దెబ్బతిన్న అభిమానం సంగతేమిటీ? దిలీప్ ని తమ హీరో అనుకుని కట్టుకున్న ప్రేమ తాలూకు గోడలు బద్దలయ్యాయి కదా ఆ మానసిక ఆస్తుల కి రక్షణ ఎలా అన్నదానికి సమాధానం చెప్పాల్సింది కాలమే...

దిలీప్‌ అభిమానిని

దిలీప్‌ అభిమానిని

నేను దిలీప్‌ అభిమానిని, ఆయన సినిమాలన్నీ చూశాను. ఇలా చేస్తాడని అనుకోలేదు. అభిమానులందరికీ అతను తలవంపులు తెచ్చాడు అని ఓ అభిమాని మీడియాతో చెప్పాడు. ఇలా ఓ వైపు అభిమానులు మరో వైపు అక్కడి నటులు, సాంకేతిక నిపుణులు అందరు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆయన చేసే పనుల గురించి ఏకరువు పెడుతున్నారు.

బహిష్కరించారు

బహిష్కరించారు

మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం (అమ్మ) నుంచి ఆయనను బహిష్కరించారు. తమలో ఒక భాగమైన బాధిత నటికి అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘అమ్మ' జనరల్‌ సెక్రటరీ మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి తెలిపారు. ఇప్పటికే అతని సినిమాల ప్రసారాన్ని అక్కడి చానెళ్ళు ఆపేసాయి కూడా

అభిమానుల్లో ఉన్న నమ్మకం

అభిమానుల్లో ఉన్న నమ్మకం

జనం లో అభిమానం సంపాదించుకోవటం కాదు ఆస్తుల కోసం, ఈగో కోసం ఇలా విలన్ లా మారిపోయిన ఈ హీరో ఇక మళ్ళీ పాత స్థాయిలో మెరవటం ఇక ఎప్పటికీ జరగని విషయమేమో.. ఎందుకంటే అతను పోగొట్టుకున్నది డబ్బు, పదవీ, ఆస్తీ కాదు... అభిమానుల్లో ఉన్న నమ్మకం, ప్రేమా.... ఇక అవి ఎప్పటికైనా దిలీప్ సంపాదించగలడా..??

English summary
Currently, the public anger is against the 'Janapriya Nayakan', as Dileep was known among his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu