For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నటి జీవిత

  By Srikanya
  |

  దిల్లీ: సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీ నటి జీవత నియమితురాలయ్యారు. మరో ఎనిమిది మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. ద మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడంతో నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శాంసన్, ఇతర సభ్యులు రాజీనామా చేయడంతో ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని బోర్డు చైర్‌పర్సన్‌గా నియమితులయిన విషయం తెలిసిందే. ఈయన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బావమరిది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  సెన్సార్‌ బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా పహ్లాజ్‌ నిహలానిని, 9 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్సన్‌, సభ్యులు గతవారం రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించింది. పహ్లాజ్‌ నిహలాని బాలీవుడ్‌లో నిర్మాతగా సుపరిచితులు. ఆంఖే, తలాశ్‌, షోలా ఔర్‌ షబ్నమ్‌ లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి జీవితను సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా నియమించారు.

  Actor-director Jeevitha inducted into Censor Board

  సెన్సార్‌ బోర్డు సభ్యులు వీరే:

  మిహిర్‌ భూటా, సయ్యద్‌ బరీ, రమేశ్‌ పతంగె, జార్జ్‌ బేకర్‌, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి టికు, ఎస్‌. శేఖర్‌, అశోక్‌ పండిత్‌, జీవిత

  రాజీనామా...వివాదం వివరాల్లోకి వెళితే...

  అయిదు నెలల క్రితం ముఖ్య కార్యనిర్వహణాధికారి భారీ అవినీతి బాగోతంతో తీవ్ర అప్రతిష్ఠ పాలైన కేంద్ర సెన్సార్‌ బోర్డు, తాజాగా మళ్ళీ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వివాదాస్పద మత గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రంపై రేగిన రగడ కేంద్ర బిందువుగా, బోర్డు సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్రం విడుదలను నిలువరించేందుకు సెన్సార్‌ బోర్డు యత్నించగా, ఎఫ్‌సీఏటీ (ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) ఆ నిర్ణయాన్ని తిరగదోడింది.

  అందుకు నిరసనగా బోర్డు ఛైర్మన్‌ లీలాశామ్సన్‌ చేసిన రాజీనామాను కేంద్రప్రభుత్వం ఆమోదించడం తరువాయి, మరో 12మంది సభ్యులూ నిష్క్రమణ బాట పట్టారు. తమ సామూహిక రాజీనామాలకు వెలుపలి జోక్యం, అవినీతి, ఒత్తిళ్లను కారణాలుగా వారు పేర్కోవడం అసలైన విడ్డూరం! షర్మిలా టాగూర్‌ పదవీ వారసురాలిగా 2011లో లీలాశామ్సన్‌ నియామకానికి కొన్నేళ్లముందే, సర్వోన్నత న్యాయస్థానం సెన్సారింగ్‌పై చరిత్రాత్మక తీర్పిచ్చింది.

  ఎవరో వూరేగింపులు తీస్తారని, వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తారనీ బెదిరి భావప్రకటన స్వేచ్ఛను బలిపీఠంపైకి నెట్టడం సరికాదన్న సుప్రీంకోర్టు- ఒక చిత్రం గుణదోషాలను పరిశీలించేటప్పుడు లోకజ్ఞానం కలిగిన సామాన్యులు పాటించే ప్రమాణాలే సెన్సార్‌బోర్డుకూ అనుసరణీయాలని స్పష్టీకరించింది. ఆ స్ఫూర్తికి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ గొడుగు పట్టడాన్ని 'వెలుపలి జోక్యం'గా లీలాశామ్సన్‌ భాష్యం చెప్పడమే కాదు, మునుపెన్నడెరుగని రాద్ధాంతానికి మూలహేతువయ్యారు.

  కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మాటల్లో- అవినీతి ఆరోపణలకు, యూపీఏ జమానాలో నియమితులై ఇంతకాలం కొనసాగిన బోర్డు సభ్యులే బాధ్యులు. అమాత్యుల వివరణాత్మక స్పందన, బోర్డుకు నిధుల కొరతపై తిరుగుబాటు సభ్యుల ఫిర్యాదులకు గాలి తీసేసింది. అనూహ్య రాజీనామాల నేపథ్యంలో, సెన్సార్‌బోర్డు సత్వర పునర్‌ వ్యవస్థీకరణకు చురుగ్గా కదలడంతోపాటు- అవినీతి ఆరోపణలపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణకూ కేంద్రం ఆదేశించింది.

  English summary
  Nine new members have also been appointed. Actress-director from Andhra Pradesh, Jeevitha Rajasekhar, was one among the new board members of Censor Board. PM Modi finally recognised the efforts of Jeevitha and Rajasekhar and rewarded them by inducting Jeevitha into Central Censor Board committee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X