twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pratap Pothen: దక్షిణాదిలో పెను విషాదం.. రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ మృతి

    |

    ప్రముఖ భారతీయ నటుడు, సినీ దర్శకుడు, ప్రతాప్ పోతేన్ చెన్నైలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ప్రముఖ హీరోయిన్ రాధిక మాజీ భర్త అయిన ఆయన ప్రస్తుతం చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఆయన మరణ వార్త దక్షినాది సినీ పరిశ్రమలో షాకింగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     12 చిత్రాలకు

    12 చిత్రాలకు

    ప్రతాప్ పోతేన్ ఆగష్టు 13, 1952 న జన్మించారు. ప్రతాప్ తన విద్యను ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేశాడు. మలయాళం, తమిళం, తెలుగుతో పాటు హిందీలో దాదాపు 100 సినిమాల్లో నటించి 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ప్రతాప్ 1985లో నటి రాధికను వివాహం చేసుకున్నారు, అంతే కాక 1986లో విడిపోయారు. ఆ తర్వాత 1990లో అమలా సత్యనాథ్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

     ఫిల్మ్‌ఫేర్ అవార్డు

    ఫిల్మ్‌ఫేర్ అవార్డు

    ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వారి వివాహ బంధ కూడా 22 సంవత్సరాల తర్వాత 2012లో ముగిసింది. ఆయన చివరిగా నటించిన చిత్రం మోహన్‌లాల్ హీరోగా రూపొందిన 'బరోజ్'. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆయన 1979లో థకారానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1980లో చమరం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1985లో మీండుమ్ ఒరు కాతల్ కథై చిత్రానికి ఇందిరాగాంధీ ఉత్తమ దర్శకుడిగా, 1987లో రితుభేదం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

    తెలుగు ప్రేక్షకులకు

    తెలుగు ప్రేక్షకులకు


    2012లో 22 మహిళా కొట్టాయం చిత్రానికి విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు, మరియు 2014లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - ప్రత్యేక జ్యూరీ అవార్డు కుడా అందుకున్నారు. ప్రతాప్ తెలుగులో ఆకలి రాజ్యం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, మరోచరిత్ర, వీడెవడు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

    మాజీ భర్తగానే

    మాజీ భర్తగానే

    అయితే ప్రతాప్ నటుడు దర్శకుడుగా కంటే రాధిక మాజీ భర్తగానే తెలుగువారిలో ఎక్కువ గుర్తింపు పొందారు. ఇక ఆయన మరణించారు అనే వార్త బయటకు వచ్చింది కానీ ఎలా మరణించారు అనే వార్త ఇంకా బయట రాలేదు.

    ప్రతాప్ పోతెన్ కార్డియాక్ అరెస్ట్

    ప్రతాప్ పోతెన్ కార్డియాక్ అరెస్ట్

    ప్రతాప్ పోతెన్ మరణానికి సంబంధించి అందుతున్న సమాచారం మేరకు ఆయన కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించారు అన్న సంగతి తెలిసి పలు దక్షిణాది నటీనటులు, దర్శక నిర్మాతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ పోతెన్ మరణవార్త తెలుసుకుని దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

    Read more about: రాధిక radhika
    English summary
    Actor director and ex husband of radhika Pratap Pothen found dead in Chennai, full details awaited regarding his death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X