»   » చెంపదెబ్బ: అభిమానికి హీరో రూ. 5 లక్షల పరిహారం!

చెంపదెబ్బ: అభిమానికి హీరో రూ. 5 లక్షల పరిహారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరో గోవింద కొన్నేళ్ల క్రితం తాను చెంపదెబ్బ కొట్టిన కేసులో అభిమానికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చారు. 2008లో గోవిందా చెంప దెబ్బ కొట్టగా....అందుకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఎట్టకేలకు గోవింద క్షమాపణ చెప్పి 5 లక్షల పరిహారం అందించడంతో కేసు ముగిసింది.

2008లో క్రితం గోవింద హీరోగా నటిస్తున్న 'మనీ హైతో మనీ హై' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉత్తర ముంబయి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గోవిందా ఉన్నాడు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారన్న సంతోష్ రాయ్ అనే వ్యక్తి వ్యాఖ్యలకు ఆగ్రహించిన గోవిందా అతని చెంపపై కొట్టాడు.

Actor Govinda to pay Rs 5 lakh compensation

గోవిందా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ సంఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ. ఐదారు లక్షలు ఖర్చు చేశానంటూ సంతోష్ రాయ్ 2014లో సుప్రీంకోర్టుకు వెళ్లాడు.

ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.... క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవిందకు సూచించింది. ఎట్టకేలకు ఈ విషయంలో గోవింద కిందకి దిగిరాక తప్పలేదు. సంతోష్ రాయ్ కి క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 5 లక్షల పరిహారం అందించారు.

English summary
Bollywood actor Govinda has offered to pay a compensation of amount Rs 5 lakh to the fan he slapped some years back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu