twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో కుప్పకూలిన కమెడియన్

    |

    సినిమా ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గానే కాకుండా పలు విలన్ రోల్స్ తో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక జయ ప్రకాష్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

    Recommended Video

    Jaya Prakash Reddy : నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం.. షాక్ లో సినీ పరిశ్రమ! || Oneindia Telugu
     సినిమాలకు దూరంగానే..

    సినిమాలకు దూరంగానే..

    తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్ 1988లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 74 ఏళ్ల జయప్రకాష్ రెడ్డి గతంలోనే కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నప్పటికీ తొందరగానే రికవర్ అయ్యారు. ఆరోగ్యరీత్యా సినిమాలను కూడా దూరం పెట్టారు. లాల్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

    సోమవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు

    సోమవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు

    కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపిన ప్రకారం.. సోమవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో జయప్రకాశ్ రెడ్డిని గుంటూరులోని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆక్సిజన్ అందక శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన పరిస్థితి మెరుగుపడటంతో మళ్లీ ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆయన బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలడంతో హాస్పిటల్‌ తరలించారు. అప్పటికీ ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించడంతో పెను విషాదం నెలకొన్నది.

    విలన్ పాత్రలతో ట్రెండ్ సెట్..

    విలన్ పాత్రలతో ట్రెండ్ సెట్..

    ఇక మంగళవారం ఉదయం గుండెపోటుతో జయప్రకాష్ ఇక లేరనే వార్త సినీ ప్రేక్షకులను, సాధారణ ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్ రోల్స్‌తో మొదట ఆడియెన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. వెంకటేశ్ నటించిన ప్రేమించుకొందాం రా అనే చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. చెన్నకేశవ‌రెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి సినిమాలతో విలన్ గా ఒక ట్రెండ్ సెట్ చేశారు. కిక్ సినిమాలో ఆయన పండించిన హాస్యం ఇప్పటికి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది.

    రాయలసీమ మాండలికంలో

    రాయలసీమ మాండలికంలో

    జయప్రకాశ్ రెడ్డి ప్రేమించుకొందాం రా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా నాటక రంగానికి సేవ చేస్తున్న సినీ రంగానికి వచ్చి వందలాది చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు. రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

    సినీ నటుడిగా మారక ముందు జయప్రకాశ్ రెడ్డి రంగస్థల నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు. గత ఐదు దశాబ్దాలుగా ఆయన రంగస్థల రంగానికి విశేష సేవలందిస్తున్నారు. ఆయన వేసిన నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇటీవల రికార్డుస్థాయిలో అత్యధిక గంటలపాటు నాటకాన్ని ప్రదర్శించిన ఘనతను సొంతం చేసుకొన్నారు.

    English summary
    Actor Jaya Prakash Reddy no more
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X