»   » ప్రముఖ నటి జయసుధ భర్త మృతి.. అనేక అనుమానాలు..

ప్రముఖ నటి జయసుధ భర్త మృతి.. అనేక అనుమానాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ అకాల మరణం చెందారు. నితిన్ కపూర్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్ మరణ వార్త తెలియగానే జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లారు. నితిన్ కపూర్ ప్రముఖ నటుడు జితేంద్ర సోదరుడు. నితిన్ కపూర్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

గత కొద్దికాలంగా జయసుధ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు సమాచారం. నితిన్ కపూర్ మృతి కారణం ఆర్థిక ఇబ్బందులా ? లేక అనారోగ్యమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. జయసుధ హీరోయిన్ గా నితిన్ కపూర్ చాలా సినిమాలను నిర్మించారు.

ఆత్మహత్య చేసుకొన్నట్టు సమాచారం.

ఆత్మహత్య చేసుకొన్నట్టు సమాచారం.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు వార్తలు అందుతున్నాయి. 1985లో నితిన్ కపూర్‌తో జయసుధకు వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడి పేరు శ్రేయన్ కపూర్, రెండో కుమారుడి పేరు నిహాన్ కపూర్.

నిర్మాతగా పలు సినిమాలు

నిర్మాతగా పలు సినిమాలు

తన కుమారుడితో ఇటీవల బస్తీ అనే చిత్రాన్ని నిర్మించారు. కలికాలం చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ‘ఆశాజ్యోతి' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా నితిన్ కపూర్ పని చేశారు. హ్యండ్సప్, కలికాలం, మేరా పతి సిర్ఫ్ మేరా హై సినిమాలను జేఎస్కే కంబైన్స్ పేరుతో నితిన్ కపూర్ నిర్మించారు.

తీవ్రమైన నిర్ణయం వెనుక కారణం..

తీవ్రమైన నిర్ణయం వెనుక కారణం..

కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆయన ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదనే వాదన వినిపిస్తున్నది. నితిన్ కపూర్‌కు ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఏమీ లేవని అంటున్నారు. పరిశ్రమలో ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని, సంతోషంగా కనిపిస్తారని చెబుతున్నారు.

ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి

ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి

నితిన్ కపూర్ అకాల మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, నిర్మాతలు, జయసుధ సన్నిహితులు షాక్ గురయ్యారు.

English summary
Actor Jayasudha Husband no more. He died in Mumbai on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu