»   » నువ్వు మా పక్కన ఉంటే సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు మామ .. నాని, మహేశ్ ట్వీట్

నువ్వు మా పక్కన ఉంటే సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు మామ .. నాని, మహేశ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సినిమాపై ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. భాష, ప్రాంతమనే బేధాలు లేకుండా బాహుబలి2 చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దిన దర్శకుడు

రాజమౌళిని ప్రముఖులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటీవల 'ఈగ' ఫేం నాని, ప్రిన్స్ మహేశ్‌బాబు, ధనుష్, రాంగోపాల్ వర్మ తదితరులు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. బాహుబలిపై వారేమన్నారంటే..

మగాడు ఇంకా పుట్టలేదు..

మగాడు ఇంకా పుట్టలేదు..

నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా అని హీరో నాని ట్వీట్ చేశాడు. బాహుబలి ఓ సినిమా కాదు. ఒక ఉత్సవం. థ్యాంక్యూ బాహుబలి టీమ్. మేము తల ఎత్తుకునేలా మీరు చేశారు అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు.

మైండ్ బ్లోయింగ్..

మైండ్ బ్లోయింగ్..

బాహుబలిలో కథ, కథనం మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా గేమ్ చేంజర్. హ్యాట్సాఫ్ టూ రాజమౌళి, బాహుబలి టీమ్. కథను అందంగా తెర మీద చెప్పే మాస్టర్ మళ్లీ విజృంభించాడు. బాహుబలి2 అంచనాలను అందుకొన్నది అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

మాటలు రావడం లేదు..

మాటలు రావడం లేదు..

బాహుబలి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ చిత్రం మాస్టర్ పీస్. కొత్త అనుభూతికి గురిచేసే సినిమా. అంతకు మించి చెప్పేది ఏమిలేదు అని ధనుష్ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ చెంప పగులగొట్టాడు..

బాలీవుడ్ చెంప పగులగొట్టాడు..

ఈద్ లేదు. దీపావళీ లేదు. సల్మాన్ లేడు. ఆమీర్ లేడు. షారుఖ్ ఖాన్ లేడు. డబ్బింగ్ సినిమా చరిత్ర సృష్టిస్తున్నది. బాలీవుడ్ చెంప రాజమౌళి పగులగొట్టాడు అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

బిగ్ సెల్యూట్

బిగ్ సెల్యూట్

భారతీయ సినిమా ఆశలను, స్ఫూర్తిని బాహుబలి ది కన్‌క్లూజన్ నిలబెట్టింది. దర్శకుడు రాజమౌళి సార్, బాహుబలి బృందానికి బిగ్ సెల్యూట్ అని తమిళ హీరో శివకార్తీకేయన్ ట్వీట్ చేశాడు.

English summary
Baahubali2 getting overwhelming response from all the section. Hero Nani, Maheshbabu, Dhanush's Interesting tweets made netizens feel happy. Many film personalities are making comments in twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu