»   » కారు పల్టీలు కొట్టినా బ్రతికాను: మంచు మనోజ్‌

కారు పల్టీలు కొట్టినా బ్రతికాను: మంచు మనోజ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : "మీ (ఫ్యాన్స్ ) ప్రేమాభిమానాలే నన్నూ, నా మనుషులనీ కాపాడాయి. మీ ప్రేమని పొందడాన్ని దీవెనలుగా భావిస్తున్నా. చనిపోయేదాకా మీ అందర్నీ ప్రేమిస్తాను'' అన్నారు హీరో మంచు మనోజ్. ఆదివారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్‌పై అప్పా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆయన ఆ సంఘటన జరిగిన తీరును సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మనోజ్ కంటిన్యూ చేస్తూ... ఒక సన్నిహిత మిత్రుని పెళ్లికి హాజరవడం కోసం ఔటర్ రింగ్‌రోడ్ మీదుగా వెళ్తున్నాను. నా ముందు వెళ్తున్న బస్సు ఉన్నట్టుండి ఎడమవేపుకు జరిగింది. బస్సును ఢీకొట్టకుండా ఉండేందుకు నా 'సువ్' (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) వాహనాన్ని కుడి వేపుకు జరిపాను. మరుక్షణంలోనే రోడ్డు మీద చనిపోయివున్న గేదెను నా వాహనం ఢీకొట్టి, గాల్లోకి ఎగిరింది. స్ట్రీట్‌లైట్లు లేకపోవడం వల్ల గేదె కనిపించలేదు. కారు పలుమార్లు పల్టీలు కొట్టింది. థాంక్ గాడ్. ఎవరికీ దెబ్బలు తగల్లేదు అన్నారు.

Actor Manchu Manoj tweet about accident

అలాగే.. ఆ సంఘటన జరగడానికి 20 నిమిషాల ముందు అమ్మ నా కారులోనే ఉంది. స్టంట్స్ నేర్చుకుని ఉండటం వల్ల సమయానికి అలెర్టయ్యాను. దేవుని దయ, మీ అందరి ప్రేమ నన్ను కాపాడాయి. అక్కడ సాయంత్రం ఆరు గంటల నుంచే గేదె కళేబరం ఉంది. దాని వల్ల నాకంటే ముందు అక్కడ రెండు యాక్సిడెంట్లు జరిగాయి. అయినా కూడా ఈ రోజు ఉదయం దాకా దాన్ని అక్కణ్ణించి తొలగించలేదు అని వివరించారు మనోజ్.

ఇక మంచు మనోజ్ ...తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవలు తుమ్మెద' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొహన్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఈచిత్రంలోని తన ఫస్ట్ లుక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. మనోజ్ గెటప్‌ను బట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మనోజ్ మీసాలు లేకుండా కనిపిస్తున్నాడు. తన ఈ లుక్‌లో మీసం లేదని, ఇతర సన్నివేశాల్లో మీసం ఉంటుందని మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన లుక్ చూసి సీరియస్ రోల్ అనుకోవద్దని, ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు మనోజ్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

English summary
Manchu Manoj tweeted, "All ur prayers saved me and my guys:) love u all for ur positive energies. I'm blessed to have ur love:) God Bless :) Love u all to death :)" Manoj, Mohan Babu Injured In Car Accident Narrating the whole accident, Manchu Manoj tweeted, "I was on my way to a dear friend's wedding on ORR. I was following a bus which suddenly veered to the left. To avoid hitting the bus, I veered to the right and the next moment I hit a dead buffalo and the SUV was airborne. Couldn't see cos there were no street lights. Car toppled multiple times. Thank god no one got hurt. Mom was in my car 20 mins before that. My stunts background kept me alert by god's grace and all your love :)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu