»   »  హైదరాబాద్ చేరుకొన్న ముమైత్.. నేడు సిట్ విచారణకు హాజరు..

హైదరాబాద్ చేరుకొన్న ముమైత్.. నేడు సిట్ విచారణకు హాజరు..

Written By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్‌ కేసు విచారణ కోసం బిగ్‌బాస్ హౌస్‌ను వదిలి సినీ నటి ముమైత్ ఖాన్ హైదరాబాద్ చేరుకొన్నారు. బుధవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినట్టు తాజా సమాచారం. గురువారం జరిగే సిటి విచారణ కోసం ఆమె బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

సానుకూలంగా స్పందించిన ముమైత్

సానుకూలంగా స్పందించిన ముమైత్

డ్రగ్స్ కేసులో విచారణ హాజరుకావాలని నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు ప్రయత్నించారు. బిగ్‌బాస్‌లో ఉండటం కారణంగా నోటీసులు ఇవ్వలేకపోయారు. చివరికి ఫ్యాక్స్ ద్వారా నోటీసులు చేరవేశారు. 27 తేదీన హాజరుకావాలని నోటీసుల్లో సూచించగా, అందుకు సానుకూలంగా స్పందించింది.

Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
బుధవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు

బుధవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు

అధికారుల ఆదేశాలు, సూచనల మేరకు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకొన్నది. మీడియా కంట పడకుండా బ్లూకలర్‌ జాకెట్‌ కప్పుకొని వేగంగా తన కారు వద్దకు వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ కేసులో రవితేజ కూడా రేపో, మాపో హాజరయ్యే అవకాశం ఉంది.

భాషపై పట్టులేకపోవడం

భాషపై పట్టులేకపోవడం

బిగ్‌బాస్‌లో తనదైన శైలిలో రాణిస్తున్న ముమైత్ ఖాన్ డ్రగ్ కేసులో ఆరోపణలు రావడం సంచలనం రేపింది. అప్పుడే ఆమె బిగ్‌బాస్ నుంచి తప్పనిసరిగా నిష్క్రమిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉత్తరాది నటి అయిన ముమైత్‌కు తెలుగుపై అంతగా పట్టులేకపోవడం ఆమెకు మైనస్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుండటం నిర్వాహకులు ఇబ్బందిగా మారింది.

గేమ్ షోకు విరుద్ధం

గేమ్ షోకు విరుద్ధం

ముమైత్ కారణంగా బిగ్‌బాస్ తెలుగులో ఇతర సెలబ్రిటీలందరూ పరాయి భాషల్లోనే మాట్లాడాల్సి వస్తున్నది. అది గేమ్ షోకు విరుద్ధం. ఈ విషయంలో ముమైత్‌ను గతంలోనే హెచ్చరించారు. తెలుగులో మాట్లాడేందుకు వీలుగా జ్యోతిని టీచర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్ కేసు వ్యవహారం హౌస్ నుంచి తప్పుకునేలా చేసింది. అయితే ఆమె మళ్లీ బిగ్‌బాస్‌లో ప్రత్యేక్షం అవుతుందా అనేది వేచిచూడాల్సిందే.

English summary
Actor Mumaith Khan reached Hyderabad from Biggboss house for SIT Probe in Drug Case. Biggboss promo shows that Mumaith was eliminated from the house on Wednesday night. As per Reports She reached Shamshabad Airport at Wednesday midnight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu