»   » నానీ, రకుల్ ఇళ్ల గురించి తెలిస్తే షాకే.. సకల సౌకర్యాలతో విల్లా.. రేటు అదిరిందయ్యా!

నానీ, రకుల్ ఇళ్ల గురించి తెలిస్తే షాకే.. సకల సౌకర్యాలతో విల్లా.. రేటు అదిరిందయ్యా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకెళ్తున్న సినీ తారలు సొంత ఇంటి కలను సాకారం చేసుకొంటున్నారు. అత్యంత విలాసవంతమైన వారి ఊహాల సౌధాల గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవలే ఓ బిడ్డకు తండ్రి అయిన నానీ తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు కూడా. ప్రస్తుతం నానీ సొంత ఇళ్లు మీడియాలో చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నానీ అలా మొదలైంది చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే.

గచ్చిబౌలి ఏరియాలో..

గచ్చిబౌలి ఏరియాలో..

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని తాజాగా ఇల్లు కొనుగోలు చేశాడు. ఇళ్లంటే మాములు నివాసం కాదు. సకల సౌకర్యాలు ఉన్న విల్లా అది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో రూ.5 కోట్లు వెచ్చించి ఖరీదైన విల్లా కొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని రోజుల కిందటే ఈ విల్లాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ముగించుకొన్నట్టు సమాచారం. త్వరలోనే సుముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నాడట ఈ టాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్.

సక్సెస్‌లతో దూసుకెళ్తున్న..

సక్సెస్‌లతో దూసుకెళ్తున్న..

కృష్ణగాడి వీరప్రేమగాథ, నేను లోకల్ సినిమాతో కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌ను సాధించాడ నానీ, వచ్చే నెలలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓవైపు వరుసగా విజయాలు, మరోవైపు కొడుకు పుట్టిన ఆనందం, ఇంకోవైపు కొత్త ఇల్లు ఇలా అనేక శుభవార్తలతో కెరీర్లోను, వ్యక్తిగత జీవితంలోనూ దూసుకెళ్తున్నాడు.

రకుల్ సొంత ఇంటి సాకారం

రకుల్ సొంత ఇంటి సాకారం

వరుస విజయాలతో అగ్ర తారగా గుర్తింపు తెచ్చుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ఓ సొంత ఇంటిని కొనుగోలు చేసింది. తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి గృహప్రవేశం చేసింది. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తన సొంత ఇంటి కొనుగోలు వ్యవహారాన్ని వెల్లడించింది.

ఇంటివాడైన రాజ్ తరుణ్, విజయ్

ఇంటివాడైన రాజ్ తరుణ్, విజయ్

పరిశ్రమలో ఎలాంటి బ్యాకప్ లేకుండా హీరోగా మారిన రాజ్ తరుణ్ హిట్ల మీద హిట్లను సాధిస్తున్నాడు. తాజాగా బంజారాహిల్స్‌లో రూ.2 కోట్ల ఖరీదైన ఓ ఇంట్లోకి మారాడు. మరో హీరో విజయ్ దేవరకొండ కూడా ఇల్లు తీసుకున్నాడు. అలా సొంత ఇల్లును కొనుగోలు చేసే జాబితాలో త్వరలో లావణ్య త్రిపాఠి కూడా చేరనున్నారు. ఇటీవల సొంత ఇంటిని కలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె చెప్పారు.

 విశాఖలో ఫాంహౌస్‌కు రాజమౌళి ప్లాన్

విశాఖలో ఫాంహౌస్‌కు రాజమౌళి ప్లాన్

ఇప్పటివరకు సామాన్యమైన ఫ్లాట్‌లో నివసిస్తున్న దర్శకుడు రాజమౌళి భారీ ఫాంహౌస్‌కు ప్లాన్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. బాహుబలి2తో ఆల్‌టైమ్ హిట్ సాధించిన జక్కన విశాఖ పరిసర ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసి బీచ్ పక్కన గెస్ట్ హౌస్ కట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

English summary
Actor Naani, Who racing with double hatrick in tollywood, is bought a Villa in Hyderabad recently. Many of the successful stars in tollywoo are fulfiliing their own house dream. Rakul preet singh, Raj Tharun, Vijay Devarkonda bought home recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu