»   » మా అబ్బాయిని మాస్ హీరో చెయ్యి.. బోయపాటికి నాగ్ బంపర్ ఆఫర్

మా అబ్బాయిని మాస్ హీరో చెయ్యి.. బోయపాటికి నాగ్ బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్ర చిత్రంతో కెరీర్ ప్రారంభించిన బోయపాటి శ్రీను కొద్ది రోజుల్లోనే స్టార్ డైరెక్టర్‌గా మారాడు. లెజెండ్, సింహా లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి బాలయ్యకు ఎదురులేని క్రేజ్‌ను అందించారు. ఆ తర్వాత సరైనోడు చిత్రంతో అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అద్భుతమైన సూపర్ హిట్‌ను అందించి బోయపాటి తన సత్తాను చాటుకొన్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో జయ జానకి నాయక అనే విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బోయపాటి హ్యాండ్ పడితే మాస్ హీరోగా మారిపోవచ్చే ఉద్దేశంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ముగ్గురు హీరోలు ఆయన కోసం ఎదురుచూస్తున్నారనేది తాజా సమాచారం.

చిరుతో 152వ సినిమా

చిరుతో 152వ సినిమా

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా జయ జాన‌కి నాయ‌క అనే సినిమా చేస్తున్న బోయపాటి త‌న తదుప‌రి చిత్రాల‌ను మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్ బాల‌కృష్ణ‌, యంగ్ హీరో నాగ చైత‌న్య‌తో చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి త‌న‌151వ సినిమాని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నుండ‌గా తదుపరి సినిమా కోసం బోయపాటి క‌స‌రత్తులు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయాల‌ని చిరు భావిస్తున్నారనే సినీ వర్గాల సమాచారం.

బాలయ్యతో 103వ సినిమా

బాలయ్యతో 103వ సినిమా

ఇక సింహా, లెజెండ్ వంటి చిత్రాల‌తో బాల‌య్య‌లోని హీరోయిజాన్ని పూర్తిగా ఎలివేట్ చేసిన బోయ‌పాటి బాల‌య్య 103వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజమైతే బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ సొంతం అవ్వడమే కాకుండా బోయపాటి కెరీర్ హైస్పీడ్ అందుకొనే అవకాశం ఉంద.ి

కొడుకు కోసం నాగార్జున ప్లాన్స్

కొడుకు కోసం నాగార్జున ప్లాన్స్

ఇక ఇప్పటివరకు అక్కినేని నట వారసుడు నాగచైతన్య లవర్‌బాయ్‌గానే ముద్ర వేయించుకొన్నాడు. తండ్రి నాగార్జునకు మాస్, క్లాస్ హీరోగా బ్రహ్మండమైన పేరున్నది. కెరీర్ ఆరంభంలో శివ లాంటి మాస్ చిత్రంలోనూ, గీతాంజలి లాంటి క్లాస్ చిత్రంలో నటించి నాగ్ మెప్పించాడు. తండ్రిలాగే చైతూ కూడా కెరీర్ ప్రారంభంలో క్లాస్ చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించాడు. ఇటీవల వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం కూడా క్లాస్ జాబితాలో చేరిపోయింది.

చైతూతో మాస్ సినిమా చెయ్యి..

చైతూతో మాస్ సినిమా చెయ్యి..

అందుకే తన కుమారుడిని మాస్ హీరోగా నిలబెట్టడానికి నాగార్జున డైరెక్టర్ బోయపాటి శీను సహకారం తీసుకోవాలని నిర్ణయించాడు. ఆ క్రమంలోనే నాగచైతన్యకి స్టార్ స్టేటస్ తీసుకురావడానికి ఓ సినిమాను చేసి పెట్టాలని బోయపాటికి సూచించినట్టు సమాచారం. చైతూతో సినిమా చేయ‌డానికి నాగార్జున బోయపాటికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి బోయపాటి కూడా రెడీగానే ఉన్నాడని అనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ చూస్తే బోయపాటి హవా మామూలుగా ఉన్నట్టు లేదు కదా..

English summary
Director Boyapati Srinu's career is now high. Tollywood Industries bigwigs are waiting for boyapati's nod. Chiranjeevi's 152th movie, Balaiah 102 movie on cards. And Nagarjuna asked to do a mass film with Naga Chaitanya. For that he offered big remunaration for Boyapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu