Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కనీసం నువ్ సంపూర్ణేశ్ బాబువి కూడా కాదు.. నెటిజన్ ట్రోలింగ్‌పై నందు కౌంటర్ అదుర్స్!!
నటుడు, హీరో, గీతామాధురి భర్త నందు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తన ప్రాజెక్ట్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడం నుంచి ప్రతీ ఒక్కదానిపై బాగా శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతీ విషయంలో మంచి స్ట్రాటజీనే వాడుతున్నారు. తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్‌పై అదిరిపోయే మీమ్స్ క్రియేట్ చేసిన వారికి బహుమతులు కూడా అందించాడు.

ట్రెండింగ్‌లో రాయే నువ్ రాయే..
బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట రాయే నువ్ రాయే అనే పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టి దూసుకుపోతోంది. అయితే తాజాగా నందు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఫేక్ అకౌంట్లపై విరుచుకపడ్డాడు.

మీమ్స్‌కు బహుమతులు..
బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్‌పై క్రియేటివ్‌గా ఎవరైనతే మీమ్స్ చేస్తారో వాళ్లకి బహుమతుల ఇస్తానని ప్రకటించాడు. అయితే అది ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో ఓ ఫేక్ అకౌంట్‌లోంచి నందు చేసినట్టుగానే ఓ పోస్ట్ వైరల్ అయింది. బహుమతులు ప్రకటించడంలో కాస్త ఆలస్యమవుతోందంటూ తెలిపాడు. అయితే అది ఫేక్ అకౌంట్ అంటూ కొట్టిపారేశాడు.

తాజాగా ఓ కామెంట్..
తాజాగా నందు ఓ నెగెటివ్ కామెంట్‌పై స్పందించాడు. నువ్ మెగాస్టార్‌వి కూడా కాదు బ్రో.. కనీసం నీకు సంపూర్ణేశ్ బాబు అంత ఇమేజ్ కూడా లేదు అంటూ ఘోరంగా కామెంట్ చేశాడు. దానికి స్పందించిన నందు.. సంపూర్ణేశ్ బాబు కనీసం కాదు బ్రదర్.. అతనేమీ తక్కువ కాదు.. సంపూ కూడా నాకు స్ఫూర్తే.. ఆయన ఎక్కడినుంచి వచ్చాడు.. ఎంత సాధించాడు అన్నది నమ్మలేనిది.. ఎంతో స్ఫూర్తినింపేది అంటూ కౌంటర్ వేశాడు.

ఎవ్వరూ తక్కువ కాదు..
ప్రతీ ఒక్కరూ ఒక్కో రకంగా అందరిలోనూ స్ఫూర్తి నింపుతుంటారు. కానీ అది మనం చూసే కోణంలోంచే ఉంటుంది. ఎవ్వరూ తక్కువ కాదు.. ఏమంటారు? అంటూ తన ఫాలోవర్స్‌ను నందు అడిగాడు. కరెక్ట్‌గా చెప్పావ్ బ్రో.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చావ్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు