For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లైనా హీరోని.. హీరోయిన్‌తో అదని.. అంత చెత్తగా రాస్తారా.. వెబ్‌సైట్‌పై నాని ఫైర్ (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  అష్టాచెమ్మా, భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మన్, జ్యో అచ్యుతానంద, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి లాంటి ఘనవిజయాలను హీరో నాని తన కెరీర్‌లో జమచేసుకొన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు రూపొందిస్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఎంసీఏ చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే అభిప్రాయన్ని సినీవర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో హీరో నాని తెలుగు ఫిల్మీబీట్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా సాయిపల్లవితో గొడవ, తన తన వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ రాసిన వెబ్‌సైట్‌పై మండిపడ్డారు. నాని ఏమన్నారంటే..

  న్యూస్ మేకర్ ఆఫ్ 2017
  సాయిపల్లవితో గొడవ గురించి

  సాయిపల్లవితో గొడవ గురించి

  సాయి పల్లవితో గొడవ జరిగింది అనే గాసిప్‌ నా దృష్టికి వచ్చింది. షూటింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌లో ఆ గాసిప్ వార్తను చూసి నేను, సాయిపల్లవి నవ్వుకున్నాం. ఆ గాసిప్ అంత పాపులర్ ఎందుకు అయిందో అర్థం కాలేదు. గాసిప్స్ రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ గాసిప్స్ గురించి ఎక్కడికి వెళ్లినా దాని గురించే అడుగుతున్నారు. ఈ గాసిప్ అలా వైరల్ కావడం ఆశ్చర్యం కలిగించింది.

   గాసిప్ అంత పాపులర్ అవుతుందని..

  గాసిప్ అంత పాపులర్ అవుతుందని..

  సాయిపల్లవితో గొడవ అనే వార్త పాపులర్ కావడానికి మేమిద్దరం సక్సెస్‌ఫుల్ యాక్టర్లు కావడమే ఓ కారణం కావొచ్చు. నా గురించి మీడియాలో చిన్న చిన్న గాసిప్స్ వచ్చాయి. చాలా విన్నాను. ఇంత పాపులర్ అవుతుందని అనుకోలేదు.

   గాసిప్స్‌ను ఫాలో అవుతారని

  గాసిప్స్‌ను ఫాలో అవుతారని

  ఇలాంటి గాసిప్స్‌ను ఇంతమంది ఫాలో అవుతారనే ఇప్పుడే తెలిసింది. వెబ్‌సైట్ నిర్వాహకులు హిట్స్, వ్యూస్ కోసం గాసిప్స్ రాస్తారని తెలుసు. అది తప్పు కాదు. కానీ ఇంతమంది ఫాలో అవుతారా? ఇంతగా ప్రజల్లోకి వెళ్తుంది అని అనుకోలేదు. సినిమాకు సంబంధించిన వార్త కూడా ఇంతగా ప్రేక్షకులకు వెళ్లలేదు.

  చాలా అనైతికంగా.. నీచంగా

  చాలా అనైతికంగా.. నీచంగా

  ఇది సందర్భమో కాదో తెలియదు. ఓ పేరున్న వెబ్‌సైట్ కాదు. అందులో పబ్లిష్ అయిన వార్త లింకును ఈ రోజు ఉదయమే నాకు ఓ ఫ్రెండ్ పంపించాడు. నిజంగా చాలా బాధవేసింది. నైతికంగా ఎంత దిగజారారంటే. చాలా దారుణం, చాలా నీచంగా ఉంది. సినిమా గురించి మాట్లాడండి. యాక్టర్ల గురించి కామెంట్స్ చేయండి. గాసిప్స్ రాయండి. బాధపడం కానీ వ్యక్తిగత జీవితం గురించి నీచంగా రాస్తారా అని నాని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  గాసిప్స్ రాస్తే తప్పులేదు.. కానీ

  గాసిప్స్ రాస్తే తప్పులేదు.. కానీ

  రెమ్యునరేషన్ గురించి రాయండి.. లేదా ఇలా బాధపెడుతున్నాడు అని రాయండి. అవేమీ అంతగా బాధించవు. కానీ వ్యక్తిగతం జీవితంలోకి దూరి, దేని గురించి రాశాడో చెప్పడానికి వీలు లేకుండా పరిస్థితి ఉంది.

  నాలాంటి పెళ్లైన హీరో

  నాలాంటి పెళ్లైన హీరో

  పెళ్లైనా నాలాంటి హీరో గురించి చాలా చెత్త హెడ్డింగ్ పెట్టి. నా పేరు ఉపయోగించకుండా నానా చెత్త రాసి. రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఓ సినిమా హీరో అంటూ.. హీరోయిన్‌తో అలా అంటూ చాలా చెత్తగా రాశారు. ఇలాంటి రాతలు చాలా బాధేస్తుంది. అలాంటి రాతలు రాసే ఉదయాన్నే లేసి ఆలోచిస్తారా అనే ఫీలింగ్ కలుగుతుంది.

   పర్సనల్ లైఫ్ గురించి

  పర్సనల్ లైఫ్ గురించి

  గాసిప్స్ రాయడంలో తప్పు లేదండి. కానీ దానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి రేఖను దాడి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం చాలా దురదృష్టకరం. మనమంతా సినిమా పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నాం. సినిమాల గురించి వెబ్‌సైట్లు రాయడం తప్పు కాదు.

   హీరో, హీరోయిన్ అని

  హీరో, హీరోయిన్ అని

  సినిమాలు బాగా లేకుంటే బాగాలేదని రాయడం ఉంటాయి. కొన్నివార్తలు ఊహించి రాస్తారు. కొన్ని వార్తల్లో నిజాలు ఉంటాయి. ఊహించకుండా మరికొన్ని అయితే ఊహకు అందని విషయాలకు చెత్త హెడ్డింగ్ పెట్టి రాశారు. రిలీజ్‌కు ముందు క్లిక్కులు, వ్యూస్ కోసం ఇలా నైతికత లేకుండా గాసిప్స్ రాయడం చాలా దారుణం. చెప్పాలనుకొన్న నా ఆవేదనను నేను చెప్పాను అని నాని అన్నారు.

  English summary
  Natural Star Nani starrer latest romantic and family entertainer movie ‘MCA’ (Middle Class Abbayi). Film is gearing up for grand release on 21st December. The film directed by Venu Sriram has already created lot of buzz. The film has Sai Pallavi as the female lead and this will be her second film in Tollywood after Sekhar Kammula’s Fidaa. This movie set to release on December 21st. In this occassion, Nani speaks to Telugu Filmibeat and fired on Websites gossips.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X