twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేమంతా ఓ గ్యాంగ్, చిరంజీవి టార్గెట్ మరోలా ఉండేది, ఆయనలో అదే మైనస్!

    |

    చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ వారు నారాయణరావును కలిసి ముచ్చటించారు.

    ఈ సందర్భంగా నారాయణ రావు సినిమా రంగంలో తన అనుభవాలతో పాటు తన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవిలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ప్రస్తావించారు.

    మేమంతా ఒక గ్యాంగ్

    మేమంతా ఒక గ్యాంగ్

    చిరంజీవిగారు, నేను, ప్రసాద్ బాబు, సుధాకర్, హరిప్రసాద్ ఒక గ్యాంగ్ లాగా ఉండేవారం. ఎక్కడ చూసినా మేమే...ఎక్కువ సమయం కలిసి గడిపేవారం. చిరంజీవిగారు జెంటిల్మెన్. నాకు మంచి స్నేహితుడు అని నారాయణరావు అన్నారు.

    చిరంజీవి ఓవల్ లోడ్ అయిపోయాడు

    చిరంజీవి ఓవల్ లోడ్ అయిపోయాడు

    టైమ్, పరిస్థితులను బట్టి చిరంజీవిగారు పాలిటిక్స్‌లోకి వెళ్లి మనిషి ఓవర్ లోడ్ అయిపోయాడు. అంతే తప్ప అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. హరిప్రసాద్ గారు చనిపోయారు. సుధాకర్ ఆరోగ్యం కొంచె క్షీణించింది.... ఇప్పుడు ఫర్వాలేదు రికవరీ అయ్యారు. తమిళంలో ఓ సినిమా కూడా చేస్తున్నారు. ప్రసాద్ బాబుగారు బిజీగానే ఉన్నారని తెలిపారు.

    అప్పుడున్నట్లే ఇప్పుడే ఉండాలని లేదు

    అప్పుడున్నట్లే ఇప్పుడే ఉండాలని లేదు

    పిల్లలుగా ఉన్నపుడు పెద్దయిన తర్వాత కూడా ఉండాలని లేదు. ఎవరి బాధ్యతలు వారికి వస్తాయి, ఎవరి కుటుంబాలు వారికుంటాయి. ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి. ఎవరి కాంపిటీషన్స్ వారికుంటాయి. రీ యూనియన్ ఎప్పుడైనా జరిగితే అంతా హ్యాపీగా ఫీలవుతామన్నారు.

    దీనిపై ఫీలవ్వాల్సిన అవసరం లేదు

    దీనిపై ఫీలవ్వాల్సిన అవసరం లేదు

    మీ నలుగురిలో ఒకరు పీక్స్ కు వెళ్లిపోయారు. ఆయన మెగాస్టార్ అయ్యారు. ఎంతో మందికి చిరంజీవిగారు ఇన్‌స్పిరేషన్ అయ్యారు.,... దీనిపై మీరు ఏమంటారు? అనే ప్రశ్నకు నారాయణరావు స్పందిస్తూ మన సోల్ పై నుంచి భూమికి వచ్చేపుడే మనం ఏం కావాలో డిసైడ్ చేసుకుని వస్తుందట. తల్లి, తండ్రిని కూడా ఎంపిక చేసుకుని వాళ్లకే పుట్టాలని డిసైట్ చేసుకుంటుంది. మన చేతుల్లో ఏమీ ఉండదు. వాళ్ల మనసులో ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది. దీని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఫీలవ్వడం అనవసరం. మన కోరిక ఏదైతే ఉంటుందో అదే మన డెస్టినేషన్. మీ కోరికే మిమ్మల్ని అక్కడకు తీసుకెళుతుందని నారాయణరావు చెప్పుకొచ్చారు.

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్లస్, మైనస్ పాయింట్స్

    చిరంజీవి చాలా హార్డ్ వర్కర్, మొదటి నుంచి కూడా ఆయన పెద్ద లక్ష్యాలతోనే ట్రావెల్ చేస్తూ వచ్చారు. ఆయన తన ప్రయాణం ఇప్పటికీ ఆపలేదు. అదే అతడి గ్రేటెస్ట్ క్వాలిటీ. తనలోని చిరు కోపం తగ్గించుకుంటే బావుంటుంది. ఆయన రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. రాక ముందే దానికంటే ఎక్కువ చేశాడు. తాను వెళుతున్న దారిలోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, రైతులను ఆదుకోవడం చేశారు. అలాంగే కంటిన్యూ అయితే బావుండేది. మదర్ థెరిసా వచ్చి ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చేరదీయలేదు. చేరదీసిన వాళ్లను చక్కగా చేరదీసింది. వాళ్లను ప్రేమించింది. చిరంజీవి కూడా అదే దారిలో ఉంటే బావుండేది అని నారాయణరావు అభిప్రాయపడ్డారు.

    English summary
    Senior Actor Narayana Rao about Megastar Chiranjeevi. Chiranjeevi is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X