»   »  శ్రీదేవికి ట్యూషన్లో ఐ లవ్‌ యూ చెప్పా, భయపెట్టింది... (చిన్న నాటి జ్ఞాపకాలు)

శ్రీదేవికి ట్యూషన్లో ఐ లవ్‌ యూ చెప్పా, భయపెట్టింది... (చిన్న నాటి జ్ఞాపకాలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల లిస్టులో తప్పకుండా ఉండే పేరు సీనియర్ నరేష్. ఎనభయ్యో దశకంలో హీరోగా తన కామెడీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నరేష్ అప్పట్లో ఓ వెలుగు వెలిగాడు.

హీరోగా రిటైర్ అయ్యాక కొంత గ్యాప్ ఇచ్చిన నరేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతూ ఇప్పటికీ నటుడిగా సత్తా చాటుతున్నాడు. ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల తనయుడు కావడంతో నరేష్ చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

'పండంటి కాపురం' చిత్రంతో బాల నటుడిగా పరిచయమై..ఆయన తర్వాత నటుడిగా, హీరోగా, కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యారు. కెరీర్లో వందకు పైచిలుకు సినిమాలు చేసిన ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టి ఇటీవలే 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

తన 45 సంవత్సరాల సినీ అనుభవాలను అనుభవాలను ఇటీవల మీడియాతో పంచుకున్న ఆయన చిన్న తనంలోని కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. (శ్రీదేవి గురించి నరేష్ చెప్పిన విషయాలు స్లైడ్ షోలో...)

మా ఇంటి పక్కనే..

మా ఇంటి పక్కనే..


నా చిన్న తనంలో మద్రాసులో శ్రీదేవి వాళ్లు తమ ఇంటి పక్కనే ఉండేవారని నరేష్ గుర్తు చేసుకున్నారు.

నాకంటే పెద్ద

నాకంటే పెద్ద


శ్రీదేవి వయసులో నాకంటే రెండేళ్లు పెద్ద అని, ఇద్దరి మధ్య అప్పుడు మంచి స్నేహం ఉండేదని తెలిపారు.

ఇద్దరం కలిసి..

ఇద్దరం కలిసి..


చిన్న తనంలో ఇద్దరం కలిసి ట్యూషన్ వెళ్లే వాళ్లం, కలిసి ఆడుకునే వాళ్లం, చాలా క్లోజ్ గా ఉండే వాళ్లమని తెలిపారు.

ఐలవ్ యూ చెప్పా

ఐలవ్ యూ చెప్పా


శ్రీదేవి అంటే నాకు అప్పుడు చాలా ఇష్టం ఉండేది, ఓ రోజు దైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పాను అని నరేష్ గుర్తు చేసుకున్నారు.

భయపెట్టింది

భయపెట్టింది


నేను ఐ లవ్ యూ చెప్పడంతో శ్రీదేవి మా అమ్మతో చెపుతానని అనడంతో భయపడి ఆ తరువాత శ్రీదేవి వైపు చూడటం మానేసానని గుర్తుకు తెచ్చుకున్నాడు.

టాప్ హీరోయిన్ అయ్యాక షాక్

టాప్ హీరోయిన్ అయ్యాక షాక్


మళ్ళీ శ్రీదేవి టాప్ హీరోయిన్ అయిన తరువాత తనకు ఎదురు పడినప్పుడు.. శ్రీదేవి తనతో మాట్లాడడమే కాకుండా తాను ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసి తనకు షాక్ ఇచ్చిందని నరేష్ చెప్పారు.

మరో హీరో కూడా..

మరో హీరో కూడా..


శ్రీదేవి అంటే పడిపోయిన జాబితాలో మరో హీరో ఉన్నాడన్న విషయాన్ని నరేష్ స్పష్టం చేసాడు... అయితే అతడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు.

English summary
Naresh successfully completed 45 Years of his film career. His journey began as Child Artiste with the movie 'Pandanti Kapuram'. On this special occasion, Naresh revealed an undisclosed fact about his personal life.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu