»   » అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Actor Naresh Serious On Comedian Comments On Mahesh Babu

  మనోజ్ ప్రభాకరన్ అనే తమిళ కమెడియన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడంపై ప్రముఖ నటుడు, మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్, 'మా' ప్రధాన కార్యదర్శి నరేష్ ఫైర్ అయ్యారు. భారత దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషల్లో సినీ పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తులు, భోజ్‌పురి, హిందీ, పంజాబీ, మరాఠీ ఇన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు ఇతర భాషల్లో, వారు తెలుగు నటిస్తుంటారు. ఒక సోదర భావంతో అన్ని పరిశ్రమల నటులు ముందుకు వెళుతున్న సమయంలో ఇలాంటివి మైత్రిని దెబ్బతీస్తున్నాయన్నారు.

  మహేష్ బాబు ఇష్యూపై 'మా' సీరియస్: చర్యలు తీసుకోవాలంటూ నడిగర్ సంఘానికి లేఖ!

  మహేష్ బాబు తెలుగు వారికి గర్వకారణం

  మహేష్ బాబు తెలుగు వారికి గర్వకారణం

  మహేష్ బాబు అనే వ్యక్తి ప్రతి తెలుగు వాడు కూడా గర్వించే నటుడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్టర్. నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. నంది అవార్డ్ అందుకున్నారు. పైగా వివాదాలకు దూరంగా ఉండే వక్తి , చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తిత్వం. ఆయన ఒక వండర్‌ఫుల్ పర్సన్ అని నరేష్ వ్యాఖ్యానించారు.

  ఉరి తీయాలి అనుకుంటాను

  ఉరి తీయాలి అనుకుంటాను

  అలాంటి వ్యక్తి మీద ఒక కమెడియన్ చేసిన కామెంట్స్ చూసి నా గుండెల్లో బాకులు దిగాయి. నేనుగానీ ఒక కళాకారుడిని గురించి ఆ విధంగా చెప్పిఉంటే నన్ను ఊరితీయాలని నేను అనుకుంటాను... అంటూ నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

   చిచ్చు పెడుతున్నారు

  చిచ్చు పెడుతున్నారు

  ఎవరో ఒక్క వ్యక్తి ఇటువంటి బాధ్యతారహితమైన కామెంట్స్ చేయడం వల్ల రెండు పరిశ్రమల మధ్య చిచ్చురేగే అవకాశం ఉంది. ఒక తెలుగువాడిగా, ఒక నటుడిగా, మహేష్ బాబు కుటుంబ సభ్యుడిగా మేము ఖండిస్తున్నాము.

  వారితో మంచి సంబంధాలు ఉన్నాయి

  వారితో మంచి సంబంధాలు ఉన్నాయి

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాకు... నడిగర్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి విశాల్, నాజర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. మలేషియాలో జరిగిన తమిళ ఈవెంటుకు మమ్మల్ని పిలిచి అద్భుతమైన మర్యాద చేసి పంపారు. వారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే అతడి మీద చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరామని, నరేష్ అన్నారు.

   అతడి స్టేచర్ ఏమిటి?

  అతడి స్టేచర్ ఏమిటి?

  అతడి స్టేచర్ ఏమిటో నాకు తెలియదు, అతడు ఎవరో కూడా తెలియదు. పేరు కూడా ఫస్ట్ టైమ్ వింటున్నాను. మహేష్ బాబు అంటే దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో. అటువంటి స్టార్‌ను కామెంట్ చేయడం బాధేసింది. ఈ విషయమై అతడిపై నడిగర్ సంఘం చర్య తీసుకుంటారని నమ్ముతున్నాను... అని నరేష్ అన్నారు.

  English summary
  Actor Naresh Serious Over Comedian Manoj Prabhakar Comments On Mahesh Babu. After this controversy, Tamil stand-up comedian named Manoj Prabhakaran duly apologized to Mahesh and his fans. He said that he had made those comments only as part of his show and that he didn’t want to target Mahesh personally.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more