»   » చికాకు పెడుతున్న నవదీప్: ఇక అకున్ సభర్వాల్ రంగంలోకి..!?

చికాకు పెడుతున్న నవదీప్: ఇక అకున్ సభర్వాల్ రంగంలోకి..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాదకద్రవ్యాల ఆరోపణలకు సంబంధించి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో పూరిజగన్నాథ్‌, నవదీప్ ఈ ఇద్దరేరూ కీలకమైన వ్యక్తులుగా అధికారులు భావిస్తున్నారు. దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్‌ యాక్టర్‌గానే కాక ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా కూడా చలామణీ అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తానే చేసేవాడని సమాచారం.

అధికారులకు చిరాకు తెప్పిస్తున్నాడట

అధికారులకు చిరాకు తెప్పిస్తున్నాడట

ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలు ఇతడి నుంచి రాబట్టవచ్చని సిట్‌ అధికారులు భావించారు అయితే స్వతహాగ నటుడే అయిన నవదీప్ మాత్రం అధికారులకు చిరాకు తెప్పిస్తున్నాడట. దేనికీ సరైన సమాధానాలివ్వకుండా ముక్తసరి సమాధానాలతో సరిపెడుతున్నాడట.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
ప్రతి ప్రశ్నకు తెలియదు, నో అని మాత్రమే

ప్రతి ప్రశ్నకు తెలియదు, నో అని మాత్రమే

ఉదయం నుంచి సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు తెలియదని, నో అని మాత్రమే నవదీప్ సమాధానాలు చెబుతుండటంతో, మధ్యాహ్న భోజన విరామం తరువాత ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా రంగంలోకి దిగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత లోతుగా

మరింత లోతుగా

ఇప్పటివరకూ నవదీప్ కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను సైతం అధికారులు ఇంకా నవదీప్ ముందు పెట్టలేదని., సబర్వాల్ వచ్చి కూర్చున్న తరువాత, వాటిని ఒక్కొక్కటిగా ముందుంచి నవదీప్ ను మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ లో కలిపే పదార్థాలు

ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ లో కలిపే పదార్థాలు

ఈలోగా, విచారణకు సహకరించి తెలిసిన పూర్తి వివరాలు వెల్లడించకుంటే జరిగే పరిణామాలను నవదీప్ కు ఓసారి తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక నవదీప్ పబ్ లో అత్యంత ముఖ్యలకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ తయారీ, దానిలో కలిపే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయంపై దాదాపు రెండు గంటల పాటు నవదీప్ ప్రశ్నలను ఎదుర్కోవచ్చని తెలుస్తోంది.

ప్రశ్నల వర్షం

ప్రశ్నల వర్షం

విచారణ క్రమంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విచారణకు వెళ్లినవారు.. 10-12 గంటల పాటు వేర్వేరు అధికారుల పర్యవేక్షణలో.. వేర్వేరు గదుల్లో ప్రశ్నల వర్షం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగతావారిని మరింత ఎక్కువ సమయం విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సోమవారం నవదీప్‌, 25న తనీ‌ష్/ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, 26న చార్మి, 27న ముమైత్‌ఖాన్‌, 28న రవితేజ విచారణకు వస్తారని అధికారులు తెలిపారు.

English summary
As per the Reports Actor Navdeep who is Facing Drug Aligation is Not cooperating with SIt officers
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu