»   » డ్రగ్ కేసు: నవదీప్‌కు ఎదురుదెబ్బ.. అయ్యోపాపం అలా జరిగిందేమిటి

డ్రగ్ కేసు: నవదీప్‌కు ఎదురుదెబ్బ.. అయ్యోపాపం అలా జరిగిందేమిటి

Written By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్ కేసులో నోటీసులు అందుకొన్న యువ హీరో నవదీప్‌ ఇటీవల విచారణకు హాజరయ్యారు. జూలై 24వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నవదీప్‌ను దాదాపు 11 గంటలు ప్రశ్నించారు. డ్రగ్ కేసులో నోటీసులు అందుకొని విచారణకు హాజరైన నవదీప్‌ను అధికారులు ప్రశ్నించి వదిలివేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారడం అందరని ఆశ్చర్య పరిచింది. ఆయన వ్యక్తిగత జీవితంపై డ్రగ్ కేసు ప్రభావం చూపడం చర్చనీయాంశమైంది.

పబ్‌లో డ్రగ్స్ విక్రయాలంటూ ఆరోపణలు

పబ్‌లో డ్రగ్స్ విక్రయాలంటూ ఆరోపణలు

టాలీవుడ్ హీరో నవదీప్‌కు గచ్చిబౌలిలో ఓ పబ్ ఉంది. ఆ పబ్‌లోనే డ్రగ్స్ విక్రయించేవారనే ఆరోపణలు నవదీప్‌పై వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకొని సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకొన్న సమయంలోనే తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని నవదీప్ మీడియాకు చెప్పారు.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
తనదైన శైలిలో సమాధానాలు

తనదైన శైలిలో సమాధానాలు

డ్రగ్స్ విక్రయాల గురించి సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నావళిని రూపొందించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సప్లయర్ కెల్విన్‌తో సంబంధాలు లేవని, అధికారులు అడిగే ప్రశ్నలకు తన వద్ద సమాచారం ఉంటే తగిన సమాధానం ఇస్తానని నవదీప్ ప్రకటించారు. అదే విధంగా ఆయన సమాధానాలు ఇచ్చారు కూడా.

వ్యక్తిగత జీవితంపై డ్రగ్ కేసు ప్రభావం

వ్యక్తిగత జీవితంపై డ్రగ్ కేసు ప్రభావం

ఆ క్రమంలోనే జూలై 24వ తేదీన నవదీప్ సిట్ విచారణకు హాజరయ్యారు. సుదీర్గమైన విచారణ సందర్భంగా అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, మరికొన్ని ప్రశ్నలకు జవాబు దాటవేశారనేది పోలీసు వర్గాల ద్వారా సమాచారం. ఇదంతా ఒకేగానే అనిపించింది. అసలు ఈ కేసుకు సంబంధం లేని ఓ విషయంలో నవదీప్‌కు ఊహించని షాక్ తగిలింది.

లోన్‌ను రిజెక్ట్ చేసిన బ్యాంకు

లోన్‌ను రిజెక్ట్ చేసిన బ్యాంకు

డ్రగ్ కేసులో విచారణను ఎదుర్కొనే సమయంలో నవదీప్ లోన్ కోసం అప్లయి చేసుకొన్నాడు. అయితే ఆయన లోన్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్టు బ్యాంక్ అధికారులు లెటర్ పంపడం చర్చనీయాంశమైంది. డ్రగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కారణంగానే రుణాన్ని మంజూరు చేయడం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

నేనే రాజు నేనే మంత్రిలో విలన్‌గా

నేనే రాజు నేనే మంత్రిలో విలన్‌గా

టాలీవుడ్‌లో అడపాదడపా తెరమీద కనపిస్తున్న నవదీప్ తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు తేజ రూపొందించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, కాజోల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కానున్నది.

English summary
Actor Navdeep was grabbing the headlines ever since Drug Scandal. The SIT officials have questioned him on July 24 for over 11 hours. Recently, the actor has applied to loan but the application got rejected due to drugs controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu