»   » డ్రగ్స్ కేసు: నవదీప్, సుబ్బరాజు, నందు స్పందన!

డ్రగ్స్ కేసు: నవదీప్, సుబ్బరాజు, నందు స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం తెలుగు చిత్రసీమను కుదిపేస్తోంది. దాదాపు 15 మంది సినీ రంగానికి చెందిన వారికి విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న స్టార్స్ మీడియా ముందుకొచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

  డ్రగ్స్ వ్యహారంలో ఎక్సైజ్ పోలీస్ శాఖ నుండి నోటీసులు అందుకున్న తెలుగు నటులు నవదీప్ స్పందించారు. అసలు తమకు ఏ పాపం తెలియదని, తమను కావాలనే ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నందు వాపోయారు.

  అప్పుడు చేసిన తప్పుకు ఇప్పటికీ ఇంకా...

  అప్పుడు చేసిన తప్పుకు ఇప్పటికీ ఇంకా...

  డ్రగ్స్ కేసు విషయంలో పోలీసుల నుండి నోటీసులు అందుకున్న మాట నిజమే అని హీరో నవదీప్ ఒప్పుకున్నారు. చిన్నతనంలో చేసిన కొన్ని తప్పులకు ఇప్పటికీ నన్ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో తాను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాను. ఆ తప్పులు సరిదిద్దుకున్నాను. డ్రగ్స్ లాంటి పెద్ద తప్పు మాత్రం ఎప్పుడూ చేయలేదని నవదీప్ అన్నారు. అసలు కెల్విన్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు.

  Navadeep in Drugs Scandal, Top Tollywood Actors Trying to Save him
  వారి మూలంగానే నా పేరు ఈ కేసులోకి...

  వారి మూలంగానే నా పేరు ఈ కేసులోకి...

  కేవలం జనరల్ కౌన్సిలింగ్ కోసమే తమను పిలిపించారని, గతంలో ఓ తప్పుడు ఈవెంట్‌మేనేజ్మెంటుతో పని చేశాను, వారి వద్ద నా నెంబర్ ఉండటం వల్లనే తనకు నోటీసులు పంపి ఉంటారని నవదీప్ అభిప్రాయ పడ్డారు. తమపై అనవసరమైన ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని నవదీప్ అన్నారు.

  డ్రగ్స్ మొహం కూడా చూడలేదు: నందు

  డ్రగ్స్ మొహం కూడా చూడలేదు: నందు

  తాను ఎప్పుడూ డ్రగ్స్ మొహం కూడా చూడలేదని.... ప్రముఖ గాయని గీతా మాధురి భర్త, నటుడు నందు వాపోయారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, ఎలాంటి మెడికల్ పరీక్షకైనా నేను సిద్ధమే. ఎవరో కావాలనే ఈ కేసులో తన పేరు ఇరికించారని నందు అనుమానం వ్యక్తం చేశారు.

  నా పేరు చూసి షాకయ్యాను

  నా పేరు చూసి షాకయ్యాను

  తనకు పోలీసుల నుండి ఎలాంటి నోటీసులు అందలేదని, మీడియాలో తన పేరు చూసి షాకయ్యానని ఆర్ట్ డైరెక్టర్ చిన్న అన్నారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మీడియా వారు వార్తలు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  సుబ్బరాజు

  సుబ్బరాజు

  డ్రగ్స్ కేసులో నోటీసులు అందిన మాట నిజమే, ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని తెలిపారని సుబ్బరాజు అన్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, కెల్విన్ ఎవరో తెలియదు, అతని వద్ద తన నెంబర్ ఎలా ఉందో కూడా అర్థం కావడం లేదన్నారు. తాను అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటాను, అంతకు మించి తనకు మరే అలవాట్లు లేవన్నారు.

  English summary
  Actor Navdeep, Subba Raju, Nandu responds over drugs case. Navadeep said in drugs case this is for the first time his name came out and requested media to telecast base less news for sensation until unless they get confirmation from cops.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more