»   »  ప్రముఖ నటుడు ఓంపురి అరెస్టుకు రంగం సిద్దం!

ప్రముఖ నటుడు ఓంపురి అరెస్టుకు రంగం సిద్దం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓంపురిపై ఆయన భార్య నందితాపురి ఫిర్యాదు చేయడం, ఆయనపై గృహ హింస కేసులు నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఓ విషయంలో వాగ్వివాదం చోటు చేసుకుందని, ఈ క్రమంలో ఓంపురి నందితాపురిపై కర్రతో దాడి చేసాడని సమాచారం.

Actor Om Puri To Face Arrest Soon!

ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో పోలీసు అధికారి మాట్లాడుతూ...ఓంపురి, అతని భార్య నందిత వారుండే ఫ్లాట్ మెయింటెనెన్స్ విషయంలో వాదులాడుకున్నారని, ఈ క్రమంలో ఆమెపై ఓంపురి కర్రతో దాడి చేసారని తెలిపారు. దీంతో ఆయనపై IPC సెక్షన్స్ 324, 506, 504 కింద కేసు నమోదు చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది.

నందిత ఓంపురికి రెండో భార్య. మొదటి భార్య సీమా కపూర్‌కు దూరంగా ఉంటున్న ఓంపురి కొంత కాలంగా రెండో భార్య నందితతో కలిసే ఉంటున్నారు. నందిత ఫిర్యాదు మేరకు తర్వలోనే ఓంపురిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పినట్లు సదరు పత్రిక పేర్కొంది.

English summary

 Veteran actor Om Puri has been reportedly booked by the police, after his wife Nandita Puri filed a complaint against him, alleging domestic violence. Reportedly, Nandita alleged that Puri had beaten her up with a stick and also threatened her last week, after a heated up argument between the couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu