»   » సెక్స్ ఎక్స్‌ప్రెషన్స్, రేప్‌...లను ప్రేరేపించేలా ఐటం సాంగులు!

సెక్స్ ఎక్స్‌ప్రెషన్స్, రేప్‌...లను ప్రేరేపించేలా ఐటం సాంగులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో అసలు ఐటం సాంగులు లేకుండా సినిమాలే ఉండటం లేదు. ఐటం సాంగుల కోసం ప్రత్యేకంగా హీరోయిన్లను తీసుకోవడం, భారీగా ఖర్చు పెట్టి చిత్రీకరించడం లాంటివి చేస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో ఐటం సాంగు అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది.

అయితే రాను రాను కొన్ని సినిమాల్లో ఐటం సాంగులు శృతి మించుతున్నాయి. సెక్స్ కంటెంట్ సైతం ఇందులో జత చేస్తున్నారు. ఇందులో నటించే భామలు కూడా రెచ్చగొట్టే విధంగా నటించడం, అందాలు ఆరబోయడం లాంటివి జరుగుతున్నాయి. ఈ ఐటం సాంగుల వల్ల రేపులు జరుగుతున్నాయనే వాదన కూడా ఉంది.

Actor Om Puri stated that item songs may provoke rapes

తాజాగా ఇదే విషయమై ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓం పురి స్పందించారు. ఇప్పటి సినిమాల్లోని ఐటం సాంగుల్లో వల్గారిటీ పెరిగి పోయింది. ఆ సాంగులు అత్యాచారాలను ప్రేరేపించే విధంగా ఉన్నాయి. సెక్స్‌లో క్లైమాక్స్‌కు చేరినపుడు ఎలా ఉంటుందో...ఇందులో నటించే నటీనటుల ఎక్స్ ప్రెషన్స్ అలా ఉంటన్నాయని వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగని ఓం పురి...... సెక్స్ ఫ్రస్టేషన్లో ఉన్న వారు ఇలాంటి అసభ్యకరమై సాంగులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆ సాంగుల సీడీలను ఇబ్బడి ముబ్బడిగా కొంటున్నారు అంటూ ఓంపురి వ్యాఖ్యానించారు. ఓం పురి చెప్పిన దాంట్లోనూ పాయింట్ ఉంది. ఇప్పటి సినిమాల్లో కొన్ని ఐటం సాంగులు రెచ్చగొట్టేవిధంగానే ఉంటున్నాయి!

English summary
Actor Om Puri stated that item songs may provoke rapes because they are being shot quite vulgarly. Coming down heavily on the dances in item songs, Om Puri said that some expressions by the actors in the item songs are as if they are reaching their climax in sex.
Please Wait while comments are loading...