»   » ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై నెలాఖరులో..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై నెలాఖరులో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి2 రిలీజ్ అయి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా యంగ్ రెబల్ స్టార్ ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. సాహో షూటింగ్ గురించి అప్పుడు మీడియాలో విశేషాలు వినిపిస్తున్నా పూర్తిస్థాయిలో నిర్మాణం జోరందుకోలేదు. తాజా సమాచారం ప్రకారం జూలై చివరి వారం కల్లా ప్రభాస్ సాహో షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటాడని తెలిసింది.

బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలతో సంప్రదింపులు

బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలతో సంప్రదింపులు

బాహుబలి కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించారు. బాహుబలి పాత్ర కోసం భారీగా బరువు పెంచుకొన్నాడు. బాహుబలి2 రిలీజ్ తర్వాత అమెరికాలో విహారయాత్ర చేసివచ్చాడు. అనంతరం గణనీయంగా బరువు తగ్గించుకొని సాహో చిత్రం కోసం నాజుక్కగా తయారయ్యాడు. ప్రస్తుతం కొద్దిరోజులుగా ముంబైలో మకాం చేసిన ప్రభాస్ బాలీవుడ్ దర్శక, నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.


సాహోతో క్రేజీ ప్రాజెక్టు

సాహోతో క్రేజీ ప్రాజెక్టు

బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు అనూహ్యంగా క్రేజ్ పెరిగింది. భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ చేరుకోవడానికి ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసుకొన్నాడు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యాక్షన్, ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.


హాలీవుడ్ స్టంట్ మాస్టర్ రంగంలోకి

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ రంగంలోకి

సాహో చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్‌లో చాలా పేరున్న స్టంట్ మాస్టర్‌ కెన్నీ బేట్స్‌ను యూవీ క్రియేషన్స్ రంగంలోకి దించింది. సాహో టీజర్‌తోనే ఆ సినిమాలో ఏ రేంజ్‌లో యాక్షన్ సీన్లు ఉంటాయో చెప్పకనే చెప్పారు. అందుకే హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.


ఖారారు కానీ హీరోయిన్ ఎంపిక..

ఖారారు కానీ హీరోయిన్ ఎంపిక..

ఇక హీరోయిన్ ఎంపిక అంశం ఎడతెగని టెలివిజన్ సీరియల్‌లా కొనసాగుతున్నది. బాలీవుడ్ హీరోయిన్ల వేట కొనసాగించిన చిత్ర యూనిట్. శ్రద్ధాకపూర్, దిశా పటానీ, కత్రినా కైఫ్, అనుష్క శెట్టి లాంటి పేర్లను పరిశీలించారు. ఈ మధ్యకాలంలో అనుష్కను ఫైనలైజ్ చేశారని అందరూ అనుకొంటుండగా.. ఎక్కువగా లావున్నందున దేవసేనను తొలగించారనే వార్త బాంబులా పేలింది. మళ్లీ ప్రస్తుతం కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసేందుకు నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.


సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో..

సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో..

సాహోలో విలన్‌గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ను ఎంపిక చేశారు. నీల్ నితిన్‌పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేసేందుకు ఏకంగా అక్కడ ఆఫీస్‌ను తెరచినట్టు తెలుస్తున్నది.English summary
Prabhas fans are gearing up for his next film – Saaho. As per the latest update,the actor is all set to start shooting for Saaho by July end. This film will be made on an extravagant budget of Rs 150 crore and will be shot across exotic locales. Saaho will have Prabhas in a whole, new avatar. Anushka Shetty will play the female lead in Saaho but recent news revealed that, she might not end being part of this saaho, because weight issues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu