twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు 6 వేల పెళ్లి ప్రతిపాదనలు.. కానీ డార్లింగ్ హృదయంలో.. అడ్డుపడ్డ రాజమౌళి!

    బాహుబలి2 ప్రభంజనం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్ ఐకాన్‌గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదేమో. బాహుబలి తర్వాత ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు పెళ్లి ప్రతిపాదనల తాకిడి ఎక్కువే అయినట్టు సమాచారం.

    By Rajababu
    |

    బాహుబలి2 ప్రభంజనం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్ ఐకాన్‌గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదేమో. బాహుబలి తర్వాత ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు పెళ్లి ప్రతిపాదనల తాకిడి ఎక్కువే అయినట్టు సమాచారం. గత ఐదేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. రాజమండ్రి, భీమవరంకు చెందిన ప్రముఖుల కుమార్తేల ప్రొఫైల్స్ కుటుంబ సభ్యులు ప్రభాస్ ముందు పెట్టగా వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు అయితే ప్రభాస్‌ ఇష్టపడింది ఈ అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమిటంటే..

    పెళ్లి ప్రతిపాదనల వెల్లువ

    పెళ్లి ప్రతిపాదనల వెల్లువ

    బాహుబలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ప్రభాస్‌తో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చారట. ప్రభాస్ ముందు దాదాపు 6 వేల పెళ్లి ప్రతిపాదనలు ముందు ఉంచారట. కానీ ప్రభాస్ మాత్రం అప్పుడు బాహుబలి మాయలో పడిపోయారట. బాహుబలి తప్పా మరో అంశం డార్లింగ్ మనసును కట్టిపడేయకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ బుట్ట దాఖలయ్యాయనేది సమాచారం. బాహుబలి పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకొనని కుటుంబ సభ్యులకు సూచించారనేది అప్పట్లో సమాచారం. అయితే ప్రభాస్ పెళ్లి రెండేళ్లు వాయిదా వేస్తే నష్టమేమీ లేదని అంచనాకు వచ్చారు.

    పెళ్లిపై నీళ్లు చల్లిన రాజమౌళి

    పెళ్లిపై నీళ్లు చల్లిన రాజమౌళి

    రెండేళ్ల తర్వాత పెళ్లి చేద్దామనుకొన్న ప్రభాస్ కుటుంబ సభ్యుల ఆశలపై దర్శకుడు రాజమౌళి నీళ్లు చల్లాడు. బాహుబలి2ను తెరపైకి తెచ్చి పెళ్లి ప్రస్తావనను మరో రెండేళ్లు వాయిదా వేశారు. అలా ప్రభాస్ పెళ్లి అనూహ్యంగా ఐదేళ్లు వాయిదా పడింది. అప్పట్లోనే ప్రభాస్‌కు 6 వేల ప్రతిపాదనలు వచ్చాయంటే బాహుబలి2 తర్వాత డార్లింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాహుబలి మాయ నుంచి ప్రభాస్ తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. జాతీయ స్థాయి నటుడిగా మారిన తర్వాత ప్రభాస్ గురించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలు ఇవే..

    దానికే అంకితం..

    దానికే అంకితం..

    జీవితంలో పెళ్లి, సొంత అభిరుచులను పక్కనపెట్టి బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్లు అంకితమయ్యారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 600 రోజులు డార్లింగ్ తపస్సులా బాహుబలి కోసం పనిచేశారు. బాహుబలి పాత్ర కోసం ఏకంగా 22 కేజీల బరువు పెరిగాడు. 87 కేజీల బరువు నుంచి 105 కేజీల బరువు వరకు శరీరాన్ని పెంచాడు.

    ప్రతీరోజు కఠోర శ్రమ..

    ప్రతీరోజు కఠోర శ్రమ..

    మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ చేశాడు. రోజుకు దాదాపు 40 గుడ్లు ఆహారంగా తీసుకొన్నాడు. కండలు పెంచి బాహుబలి అంటే ప్రభాస్ అనేలా శరీర ఆకృతిని మలుచుకొన్నాడు. తెరపైన బాహుబలికి ప్రభాస్ తప్ప మరో నటుడు సరితూగడు అనే ఫీలింగ్ కల్పించడంలో డార్లింగ్ సఫలమయ్యాడు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ప్రభాస్‌కు నీరాజనం పడుతున్నారు.

    బుక్ రీడింగ్ అంటే ఇష్టం..

    బుక్ రీడింగ్ అంటే ఇష్టం..

    ఒకవైపు కెరీర్‌ను ప్రభావవంతంగా మలుచుకొంటూనే ప్రభాస్ తన వ్యక్తిగత అభిరుచులపై దృష్టిపెట్టాడు. తనకు ఇష్టమైన పుస్తక పఠనాన్ని కొనసాగించాడు. ప్రభాస్‌కు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టమట. ఇంట్లో వ్యక్తిగతంగా మంచి లైబ్రరీ కూడా ఉందనదీ తాజా సమాచారం.

    వర్కవుట్లు.. వాలీబాల్‌ హాబీ

    వర్కవుట్లు.. వాలీబాల్‌ హాబీ

    ప్రభాస్ చదవడమే కాకుండా వర్కవుట్లు, స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టపడుతారట. జిమ్‌లో కసరత్తులు చేస్తూనే శరీర పటుత్వం కోసం బాహుబలి టైమ్‌లో వాలీబాల్ లాంటి ఆటను ఆడారట. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో కలిసి వాలీబాల్ అడుతారనే సన్నిహితుల సమాచారం. వీలు చిక్కితే రాక్ క్లైంబింగ్ లాంటిపైనా దృష్టిపెడుతారనేది ఎవరికీ తెలియని విషయం.

    ఒదిగి ఉండటం డార్లింగ్ స్వభావం..

    ఒదిగి ఉండటం డార్లింగ్ స్వభావం..

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనేది ప్రభాస్ మనస్తత్వం అని స్నేహితులు చెప్తుంటారు ఎంత క్రేజ్ వచ్చినా లో ప్రొఫైల్ ఉండటంతో ప్రభాస్‌ స్వభావం. ఎలాంటి వివాదాలు చుట్టముట్టని నటుల్లో ప్రభాస్ ఒకరని చెప్పుకొంటారు. ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు డౌన్ టూ ఎర్త్ అటిట్యూడ్‌తో ఉంటారనేది ఇండస్ట్రీలో టాక్.

    10 కోట్లు ఆఫర్‌కు..

    10 కోట్లు ఆఫర్‌కు..

    ఒకదానికి కోసం కట్టుబడి ఉన్నట్లయితే ఎలాంటి వాటినైనా లైట్ తీసుకుంటాడనేది బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంలో వెల్లడైంది. బాహుబలి షూటింగ్ సమయంలో ఓ సంస్థ ఓ వ్యాపార ప్రకటనలో నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిన బాహుబలి టైమ్‌లో ఏ ప్రాజెక్ట్‌ను చేయనన్న నిర్ణయంతో దానిని తిరస్కరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ ఘటన ప్రభాస్ అంకితభావానికి సాక్ష్యంగా నిలిచింది.

    పక్షి ప్రేమికుడు..

    పక్షి ప్రేమికుడు..

    ప్రభాస్‌లో చాలా మందికి తెలియని మరో కోణం ఉంది. ఈ డార్లింగ్‌ పక్షి ప్రేమికుడు. తన నివాసంలో పక్షుల కోసం ఎన్నో పంజరాలను ఏర్పాటు చేశాడట. వాటికి స్వేచ్ఛ కూడా కల్పిస్తాడట. బయటకు వదిలితే తిరిగి అవి తమ గూటికి చేరుకొంటాయట.

    రికార్డుల రారాజు..

    రికార్డుల రారాజు..

    ప్రభాస్ నటించిన బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తున్నది. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నీ బాహుబలికి దాసోహం అంటున్నాయి. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన అమీర్‌ఖాన్ పీకే సినిమా రికార్డును తడిచిపెట్టేందుకు పరుగులు పెడుతున్నది.

    English summary
    Baahubali Hero Prabhas is a national sensation now. How many of these facts about Prabhas did you know?. Prabhas received around 6,000 marriage proposals but he turned all of them down because he wanted to be focussed on Baahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X