twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రదీప్ శక్తి కన్నుమూత: ఆయన హిట్ క్యారక్టర్స్ ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్: విలన్ గా పలు చిత్రాల్లో నటించిన ప్రదీప్‌శక్తి కన్నుమూశారు. శనివారం అమెరికాలోని న్యూజెర్సీలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమార్తె ఉన్నారు. ఆయన తొలి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌'తోనే గుర్తింపు తెచ్చుకొన్నారు.

    ఆయన పూర్తి పేరు వాసిరెడ్డి ప్రదీప్ శక్తి. గుంటూరులోని లక్ష్మీపురానికి చెందిన ప్రదీప్ శక్తి,'కలియుగ విశ్వామిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించటం విశేషం. వారసుడొచ్చాడు, టూ టౌన్ రౌడీ, కమల్‌హాసన్ 'నాయకుడు', గుణ, ప్రేమ, బ్రహ్మ, పరుగో పరుగు, చిత్రం భళారే విచిత్రం సినిమాల్లో విలన్ పాత్రలతో అలరించారు.

    స్టేల్ ('సుబ్రమణ్యం ఫర్ సేల్' రివ్యూ)

    ఆ తరవాత నెగిటివ్ పాత్రలే ఎక్కువగా చేసారు ముఖ్యంగా దర్శకుడు వంశీ చిత్రాల్లో ఆయనకు మంచి పాత్రలు దక్కాయి. కమిడియన్ గానూ సత్తా చాటారు.వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఏప్రిల్ 1 విడుదల',లో హీరోయిన్ బాబాయ్‌గా నవ్వించారు. ‘చెట్టు కింద ప్లీడర్‌' పాత్ర కూడా బాగా అలరించింది.

    తెలుగు పరిశ్రమ షాక్.. 10 రోజుల్లో 6 మరణాలు

    1990లో సినీరంగం నుంచి తప్పుకుని అమెరికాలోని న్యూజెర్సీలో ‘బాబా హట్‌' హోటల్ పెట్టుకుని సెటిలయ్యారు. చాలా కాలం తరవాత వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చింతకాయల రవి'లో మళ్లీ నటుడిగా తెరపైకి వచ్చారు. ప్రదీప్‌ శక్తి మరణం పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

    ఈ సందర్బంగా ఆయన హిట్ క్యారక్టర్స్ ని కొన్నిటిని మీకు ఇక్కడ అందిస్తున్నాం...

    లేడీస్ టైలర్

    లేడీస్ టైలర్

    రాజేంద్రప్రసాద్ హీరోగా రుపొందిన ఈ సినిమాలో వెంకటరత్నం క్యారక్టర్ లో ఇమిడిపోయారు. విలక్షణమైన విలన్ క్యారక్టర్ ఇది.

    జానకి రాముడు

    జానకి రాముడు

    నాగార్జునకు సరైన ప్రత్యర్ధిగా అదరగొట్టి ప్రేక్షకులను మెప్పించారు. చెల్లమ్మగారు అంటు చెప్పిన డైలాగుల్లో మంచి ధృఢమైన వాక్కు వుండేది

    ప్రేమ

    ప్రేమ

    పీటర్ క్యారక్టర్ తో, చివర్లో వెంకటేష్ తో తన్నులు తినే సన్నివేషంలో బాగ నటించి మెప్పించారు.

    చెట్టుకింద ప్లీడర్

    చెట్టుకింద ప్లీడర్

    పి. బసవరాజు అనే అడ్వకేట్ పాత్రలో ఓదిగిపోయారు ఈ సినిమాలో.

    చిన్నారి ముద్దుల పాప

    చిన్నారి ముద్దుల పాప

    ఈ సినిమాలో జగపతి బాబు కు తండ్రి గా అలరించారు.

    ఎప్రిల్ 1 విడుదల

    ఎప్రిల్ 1 విడుదల

    హీరోయిన్ అయిన శోభనకి (భువనేశ్వరికి) బాబాయ్ గా నటించారు.

    గుణ

    గుణ

    ఇస్మాయిల్ క్యారక్టతో జనాలను బాగానే బయపెట్టాడు.

    బ్రహ్మ

    బ్రహ్మ

    మోహన్ బాబు హీరోగా వచ్చిన ఈచిత్రంలో ప్రదీప్ శక్తి పాత్ర చాలా గమ్మత్తుగా సాగుతుంది

    చిత్రం భళారే విచిత్రం

    చిత్రం భళారే విచిత్రం

    ఈ సినిమా చివర్లో పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి కధని సుఖాంతం చేసి వెళ్లిపోయాడు.

    సుబ్రమణ్యం ఫర్ సేల్

    సుబ్రమణ్యం ఫర్ సేల్

    ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' ఆయన ఆఖరి చిత్రం.అందులో కూడా ఓ రెస్టారెంట్ ఓనర్ క్యారక్టరే పోషించారు.

    సంతాపం

    సంతాపం

    వన్ ఇండియా తెలుగు ...ప్రదీప్ శక్తి మృతి కి మనస్పూర్తిగా...సంతాపం తెలియచేస్తోంది.

    English summary
    Actor Pradeep Shakti is no more. Suffering from illness for some years, Pradeep Shakti (60) breathed his last on Saturday in New York.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X