»   » మరీ సంచలనం చేయకండి: డ్రగ్స్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్

మరీ సంచలనం చేయకండి: డ్రగ్స్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ఇప్పుడు పైకి కనిపించని ఆందోళన లో ఉంది ఎప్పుడూ వివాదాస్పద అంశాలతో ఉంటూనే ఉంటుంది ఏ సినీ పరిశ్రమ అయినా అయితే టాలీవుడ్ కొంత వేరు... బాలీవుడ్ మాదిరి మాఫియాలు గానీ తమిళ, మళయాల ఇండస్ట్రీలల్లో ఉండే రౌడీఇజం గానీ ఇక్కడ కనిపించేవి కాదు.

నటన లో తప్ప వేరే వ్యాపారాల్లోకి కూడా దిగకుండా ఉన్నారు ఓ పదేళ్ళ కిందటి వరకూ, మనవాళ్ళు క్లీన్ ఇమేజ్ తోనే ఉండేవాళ్ళూ ఉన్నారు కూడా అయితే గత అయిదేళ్ళ లో పరిస్థితులు మారిపోయాయి. హీరోలూ, నటులూ వేరే బిజినెస్ లు మొదలు పెట్టటం దాన్లో పబ్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ లాంటి ఇల్లీగల్ వ్యవహారాలు జరిగే "దందా" లు ఉండటం మామూలైపోయింది...

Actor Prakash Raj Tweet about Drugs controversy in Tollywood

ఈ సంఘటన మీద ఒక్కొక్కరు గా టాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని వరుణ్ తేజ్ అన్నారు. కొందరు చేసిన పనికి చాలా మంది ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు బడుతున్నారని, అది చాలా తప్పు అని అన్నారు.

ప్రతి ఇండస్ట్రీలోనూ 'చెడు' అనేది ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపు ఏమీ కాదని చెప్పారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి తనకు మెసేజ్ చేసేంత వరకు ఈ విషయం తనకు తెలియదని, ఆ మెసేజ్ చదివాక గుండెపగిలిందని చెప్పారు.

Actor Prakash Raj Tweet about Drugs controversy in Tollywood

అదే బాటలో ఒకప్పటి టాలీవుడ్, ఇప్పటి కోలీవుడ్ నటి శ్రియా రెడ్డి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ ఉదంతం పై నోరు విప్పారు. డ్రగ్స్‌ కేసును సంచలనాత్మకం చేయడం సరికాదని, దర్యాప్తులో వివరాలు తెలిసేవరకు సంయమనం పాటించాలని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
"It is high time we the people and the media realise it's not fair to sensationalise issues before the complete truth comes out" Tweets Prakash Raj
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu