»   » నా భార్యకు ముందే పెళ్లైంది.. ఆ రాత్రి గుండె పగిలింది.. నరకం నుంచి .. హీరో ప్రశాంత్

నా భార్యకు ముందే పెళ్లైంది.. ఆ రాత్రి గుండె పగిలింది.. నరకం నుంచి .. హీరో ప్రశాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు ప్రశాంత్ వైవాహిక జీవితం వివాదాస్పదంగా మారడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తన మాజీ భార్య గృహలక్ష్మిపై ప్రశాంత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్యతో విడాకులు తీసుకోవడం వెనుక కారణాన్ని ఆయన వివరించారు.

నా భార్యకు అంతకుముందే పెళ్లి

నా భార్యకు అంతకుముందే పెళ్లి

నా మాజీ భార్య గృహలక్ష్మికి వేణు ప్రసాద్ అనే వ్యక్తితో అంతకుముందే పెళ్లైంది. ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టి నన్ను మోసం చేసింది. తనతో పెళ్లైనా తర్వాత ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నది. నా భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు పొందాను అని ప్రశాంత్ వివరించారు.

ఆ రాత్రి గుండె పగిలింది..

ఆ రాత్రి గుండె పగిలింది..

గృహలక్ష్మికి ఇదివరకే పెళ్లయిందనే విషయం తెలిసి గుండె పగిలింది. ఓ రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ‌కాల్ చేసి గృహలక్ష్మికి మరో వ్యక్తితో ఇదివరకే పెళ్లయింది అని చెప్పడంతో ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపాను. ఆ బాధను తట్టుకోలేక గృహలక్ష్మి పెళ్లి వివరాలు సేకరించేందుకు చాలా ప్రభుత్వ వెబ్‌సైట్లు వెతికాను అని ప్రశాంత్ పేర్కొన్నారు.

ఎవరికీ ఎదురుకాకూడదు

ఎవరికీ ఎదురుకాకూడదు

జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుడదని కోరుకొంటున్నాను. గత ఆరేళ్ల వైవాహిక జీవితంలో నరకం చూశాను. ఈ వివాదంలో ఎన్నో ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ వ్యవహారం నుంచి బయటపడినందుకు చాలా ఊరటగా ఉంది. ఇంకా నా కుమారుడి సమస్య అలానే పెండింగ్‌లో ఉన్నది. మైనర్ బాలుడు తల్లి పర్యవేక్షణలో ఉండాలనేది చట్టం చెబుతున్నది. చట్టం ప్రకారం నడుచుకొంటాను.

ప్రశాంత్‌ను మోసం చేయలేదు..

ప్రశాంత్‌ను మోసం చేయలేదు..

ప్రశాంత్ ఆరోపణలను గృహలక్ష్మి ఖండించింది. ప్రశాంత్‌ను నేను మోసం చేయలేదని పేర్కొన్నది. విడాకుల తీర్పును పైకోర్టులో సవాల్ చేసింది. అయితే హైకోర్టు గృహలక్ష్మి వాదనను తోసిపుచ్చి. ఆమె నుంచి ప్రశాంత్ విడిపోవడమే కరెక్టని తీర్పునిచ్చింది అని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగు వారికి సుపరిచితుడు

తెలుగు వారికి సుపరిచితుడు

తొలిముద్దు, ప్రేమఖైదీ, జీన్స్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ప్రశాంత్ సుపరిచితుడు. 2005లో ప్రశాంత్ గృహలక్ష్మిని వివాహం చేసుకొన్నాడు. పలు కారణాల వల్ల ఇటీవల తన భార్య గృహలక్ష్మికి విడాకులు ఇచ్చారు. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణాన్ని హీరో బహిర్గతం చేశారు.

English summary
Actror Prashanth now reliefed man in world. Six years of running to the court, legal battling a divorce case and fighting charges of dowry and harassment, life had indeed run into troubled waters for actor Prashanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu