twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు బాలయ్య చెంపలు వాయించాడు.. ఎందుకంటే.. కారణం చెప్పిన పృధ్వీ

    By Rajababu
    |

    సినీ నటుడు పృధ్వీ అలియాస్ బాలిరెడ్డి పృధ్వీరాజ్ అంటే గుర్తు పట్టడం కష్టం గానీ.. థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటే ఠక్కున అందరికీ గుర్తొస్తాడు. నిజం మాట్లాడితే ఏమౌతుందో అని పృధ్వీ వెనుక ముందు ఆలోచించడు అని సినీ పరిశ్రమలో చెప్పుకొంటాడు. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాడు అని తోటి నటులు అంటుంటారు. అలాంటి పృథ్వీ తాజాగా పలు విషయాలపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

     వారికే మద్దతు తెలుపుతాను..

    వారికే మద్దతు తెలుపుతాను..

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాను కానీ. అది మనకు సరిపడదు అనే విషయం అర్థమైంది. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్లకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతాను అని పృధ్వీ అన్నారు.

     మా సభ్యులతో సంబంధాలు

    మా సభ్యులతో సంబంధాలు

    ఒకవేళ అధ్యక్ష పదవిలో ఉండి మళ్లీ పోటీచేయాలనుకుంటే వారికి నేను సపోర్ట్ చేయను. మా సభ్యులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా అభిప్రాయం వెల్లడిస్తే పరిస్థితులకు అనుగుణంగా వాటికి సానుకూలంగా స్పందిస్తాను.

    రాజకీయాల్లోకి నా అడుగు

    రాజకీయాల్లోకి నా అడుగు

    భవిష్యత్‌లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తాను. కానీ నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయాలు చేస్తాను. నటుడి తర్వాత ప్రయాణం రాజకీయాల వైపే అని పృధ్వీ పేర్కొన్నారు.

     అందుకే రాజకీయాల్లోకి

    అందుకే రాజకీయాల్లోకి

    నీతివంతమైన రాజకీయాలంటే నాకు ఇష్టం. వాటి కోసమే పాలిటిక్స్‌లోకి వస్తాను. ఒకవేళ డబ్బు కోసమే అయితే సినీ పరిశ్రమ కంటే మంచి ఆదాయం ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. డబ్బు కోసమే అయితే వేషాలు వేసుకొంటే సరిపోతుంది అని పృధ్వీ అన్నారు.

     లెజెండ్ సినిమాలో బాలకృష్ణ

    లెజెండ్ సినిమాలో బాలకృష్ణ

    లెజెండ్ సినిమాలో ఓ సందర్భంలో నన్ను బాలకృష్ణ చెంపపై కొడుతాడు. రాజకీయ పార్టీలు మారడంపై బాలయ్య నిలదీస్తాడు. అప్పుడు నీ తల్లి వయసు ఎంత అని ప్రశ్నిస్తాడు. అందుకు నేను పోషించిన పాత్ర 74 ఏళ్లు అని చెబుతుంది.

     అమ్మను మార్చవా?

    అమ్మను మార్చవా?

    నా తల్లి వయసు చెప్పగానే ఠపీమని నా చెంపపై కొడుతాడు. 74 ఏళ్ల వయసు ఉన్న అమ్మను మార్చావా అని బాలయ్య నిలదీస్తాడు. అప్పుడు అదేంటండీ ఎవరైనా అమ్మను మారుస్తారా అని అంటాను. మరి తల్లిలాంటి పార్టీని ఎలా మారుస్తావురా అని చెంపలు వాయిస్తాడు లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ.

     బాలయ్యలా కొట్టినప్పుడే

    బాలయ్యలా కొట్టినప్పుడే

    లెజెండ్ సినిమా మాదిరిగానే రాజకీయాల్లోకి బాలకృష్ణ లాంటి వ్యక్తులు రావాలి. పార్టీలు మార్చే నేతలను చెంపలు వాయించే నేతలు ఉండాలి. అప్పుడే పార్లమెంట్, అసెంబ్లీలు, రాజకీయాలు బాగుపడుతాయి అని పృధ్వీ అన్నారు.

    English summary
    Balireddy Prudhviraj Alias Prudhvi is a comedian in Tollywood. He got his popular name, 30 Years Industry, in Krishna Vamsi's movie, Khadgam. Since then he was become top comedian in the industry. In this occassion, He spoke to media and revealed his views and opinion on present day politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X