»   »  లారెన్స్ తల్లికోసం కట్టిస్తున్న గుడిలో బొమ్మ ఇలా ఉంది

లారెన్స్ తల్లికోసం కట్టిస్తున్న గుడిలో బొమ్మ ఇలా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, సామాజిక వ్యక్తిత్వం ఉన్న ఓ మంచి మనిషిగా, ఇలా ఎన్నో రంగాల్లో ఎందరో మనసులను గెలుచుకున్న లారెన్స్, తన తల్లి కోసం గుడి కట్టిస్తున్నాడు. తల్లి జీవించి ఉండగానే ఇలా గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం ఒక్క లారెన్స్‌కే చెల్లింది. తను ఎంతగానో ఆరాధించే రాఘవేంద్ర స్వామి గుడి ఎదురుగానే తన తల్లికి గుడి కట్టిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు ఈ స్టైలిష్ కొరియోగ్రాఫర్.

 Actor Raghava Lawrence to build temple for his mother

తనను తొమ్మిది నెలలు మోసి, కని.. ఎన్నో కష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తన తల్లి రుణం తీర్చుకోవడానికి.. తల్లి గొప్పదనాన్ని లోకానికి చాటడానికి ఈ గుడి కట్టిస్తున్నట్లు లారెన్స్ తెలిపాడు. తాను కట్టిస్తున్న గుడిలో నెలకొల్పబోతున్న విగ్రహం తాలూకు ఫొటోను తన తల్లికి చూపిస్తే పరవశించిపోయిందని లారెన్స్ తెలిపాడు.

తన తల్లి తన కోసం పడ్డ కష్టాల్ని ఎప్పటికీ మరిచిపోని లారెన్స్ ఆమె కోసం ఎంతో చేశాడు. తనకిష్ట దైవం అయిన రాఘవేంద్రస్వామి గుడి కట్టించాడు. అంతటితో ఆగకుండా అదే గుడి ప్రాంగణంలో తన తల్లి కోసం కూడా ఓ గుడి కట్టబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా గుడి పూర్తి కావచ్చింది. ఇంకో కొద్ది ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతోంది.

 Actor Raghava Lawrence to build temple for his mother

స్థానిక అంబత్తూరులో కొన్నేళ్ల క్రితం లారెన్స్ నిర్మించిన రాఘవేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయంలో ప్రతిష్టించేందుకు రాజస్థాన్‌లో తయారుచేయిస్తున్న 5 అడుగుల పాలరాతి విగ్రహం సిద్ధమైంది. మార్చి నెలలో తమిళ ఉగాది రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు లారెన్స్ మంగళవారం ప్రకటించారు. 13 అడుగుల గాయత్రీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ కిందనే లారెన్స్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

English summary
Raghava lawrence is happy with mother statue, Statue of his mother is ready in Rajasthan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu