For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాలకు పనికిరాడు అన్నారు.. శంకర్ జెంటిల్మన్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. రాజశేఖర్

  By Rajababu
  |
  Rajasekhar Revealed Personal And Professional Things To Media శంకర్ ఆఫర్ రిజెక్ట్ చేశా

  తెర మీద యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఠక్కున గుర్తు వచ్చేది హీరో రాజశేఖర్. ఆయన నటించిన అంకుశం, అన్న, మగాడు చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. ఆ తర్వాత అల్లరి ప్రియుడు లాంటి రొమాంటిక్ చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో సినిమాలకు దూరమయ్యాడు. తాజాగా పీఎస్వీ గరుడవేగ అనే యాక్షన్ చిత్రంతో ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..

  టీ కృష్ణ అవకాశం

  టీ కృష్ణ అవకాశం

  తమిళ సినిమాలు చూసిన దర్శకులు టీ కృష్ణ నాకు అవకాశం ఇచ్చారు. ఏవీఎం బ్యానర్‌లో రూపొందిన ఆ చిత్రంలో విలన్ రోల్ వేశాను. అవి చూసి ఇంప్రెస్ అయిన కృష్ణగారు వందేమాతరం చిత్రానికి ఎంపిక చేశారు. దాంతో ఇప్పటికి 90పైగా సినిమాల్లో నటించాను.

   సినిమాలకు పనికిరాడు

  సినిమాలకు పనికిరాడు

  నాకు చిన్నతనం బాగా నత్తి. వారిని కలిసి సమయంలో ఇంకా బాగా నత్తి ఉండటంతో నిర్మాత పోకూరి బాబూరావు సినిమాలకు పనికిరాను అన్నారు. కానీ టీ కృష్ణ పట్టుబట్టి నన్ను తీసుకొన్నారు. నా యాక్టింగ్ చూసిన తర్వాత పోకూరి బాబూరావు రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత నాతో ఆయన ఐదు, ఆరు సినిమాలు తీశారు. ఆయన తీసిన అన్న చిత్రం పెద్ద హిట్ అయింది.

   ఫెయిల్యూర్స్‌తో సినిమాలకు దూరం

  ఫెయిల్యూర్స్‌తో సినిమాలకు దూరం

  కెరీర్‌లో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో సినిమాల్లో నటించడంలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత విన్న కథలు నచ్చలేదు. ఏ సినిమాలు చేస్తే బాగుంటుంది అనే సందేహంలో చాలా రోజులు ఉన్నాను. మధ్యలో విలన్ పాత్రలు వేయమని అడిగారు. పాత్ర తీరు నచ్చక చేయలేదు.

   గడ్డం గ్యాంగ్‌తో నష్టాలు

  గడ్డం గ్యాంగ్‌తో నష్టాలు

  గడ్డం గ్యాంగ్ సినిమాతో నేను చాలా ఆర్థికంగా నష్టపోయాను. నా తల్లిదండ్రులు సొంతంగా సినిమాలు తీయవద్దు అని హెచ్చరించారు. దాంతో సినిమాల జోలికి వెళ్లలేదు. ఆ సమయంలో దర్శకులు ప్రవీణ్ సత్తారు వచ్చి పీఎస్వీ గరుడ వేగ చిత్ర కథ చెప్పారు. దాంతో నాకు హలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరిక తీరింది.

   హాలీవుడ్ రేంజ్‌లో ప్రవీణ్..

  హాలీవుడ్ రేంజ్‌లో ప్రవీణ్..

  హాలీవుడ్ రేంజ్‌లో ప్రవీణ్ సత్తారు చెప్పిన కథను విని నేను, జీవిత, నా పిల్లలు బాగా ఎక్సైట్ అయ్యారు. కథ విన్న తర్వాత బడ్జెట్ అడిగితే సుమారు 6 కోట్లు అవుతాయి అని ఆయన చెప్పారు. అలాంటి కష్ట సమయంలో నా తండ్రి స్నేహితుడు కోటేశ్వరరాజు ముందుకు వచ్చారు. నీతో సినిమా చేయాలని ఉంది కోటేశ్వరరాజు చెప్పారు.

   ఎంతైనా పర్వాలేదన్నారు నిర్మాత

  ఎంతైనా పర్వాలేదన్నారు నిర్మాత

  ప్రవీణ్ సత్తారు చెప్పిన కథ విన్న కోటేశ్వరరావు భారీ బడ్జెట్‌తో తీస్తేనే బాగుంటుంది అనే అంచనాకు వచ్చారు. 6 కోట్లు కాదు.. 25 కోట్లు అయినా ఫర్వాలేదు అని ధైర్యంగా ముందుకు వచ్చాడు. దాంతో గరుడ వేగ సినిమా ప్రారంభమైంది. సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ప్రవీణ్ సత్తారు చెప్పిన దానికంటే ఎక్కువగా బాగా వచ్చింది.

   శంకర్ ఆఫర్ రిజెక్ట్ చేశా

  శంకర్ ఆఫర్ రిజెక్ట్ చేశా

  జెంటిల్మన్ చిత్రానికి ముందు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నాకే కథ చెప్పారు. డేట్స్ అడిగారు. అయితే నేను ఆయన ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అంతకుముందే నేను అల్లరి ప్రియుడు సినిమాకు డేట్స్ ఇచ్చాను. డేట్స్ అడ్జస్ట్ చేయలేకోపోయాను. అప్పుడు ఆయనకు సారీ చెప్పి జెంటిల్మన్ సినిమా చేయలేను అని చెప్పాను.

   10 లక్షలు అడ్వాన్స్‌తో

  10 లక్షలు అడ్వాన్స్‌తో

  జెంటిల్మన్ చిత్రం కోసం నాకు పది లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు అడ్వాన్స్ ఇస్తాను అని పదే పదే చెప్పారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరకపోవడంతో ఆ సినిమాను వదులుకొన్నాను. అలా చాలా పెద్ద సినిమాలు రిజెక్ట్ చేశాను.

   హీరోయిన్లతో నటించాలంటే..

  హీరోయిన్లతో నటించాలంటే..

  ఎన్ని సినిమాలు చేసినా హీరోయిన్లతో నటించాలనే సరికి నాకు కొంత సిగ్గు వస్తుంది. నా భార్య కూడా అదే విషయాన్ని చెప్తుంది. నా పిల్లలు కూడా హీరోయిన్‌తో చేసేటప్పుడు ఎందుకు బిగుసుకుపోతారు అని అడుగుతారు. కానీ ఇప్పుడిప్పుడే దానిని సరిదిద్దుకొంటున్నాను.

  English summary
  Actor Rajasekhar is latest movie is PSV Garuda Vega. This movie set to release on November 3rd. After few years gap, he is coming up with this movie. in this occassion, Rajasekhar chats with media. So he revealed personal and professional things to a channel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X