»   » హీరో రాజశేఖర్ ఇంట విషాదం

హీరో రాజశేఖర్ ఇంట విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందులో రాజశేఖర్ రెండో సంతానం. ప్రస్తుతం ఆండాళ్ వరదరాజ్ పార్ధీవ దేహాన్ని సాయంత్రం 5గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 Actor Rajasekhar's mother dies

చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా విషయంలో తలమునకలుగా ఉన్న రాజశేఖర్ కి ఇప్పుడు తల్లి మరణం మరో దెబ్బ అనే చెప్పుకోవాలి.

English summary
Tragedy struck hero Rajasekhar and his family. The actor’s mother, Aandal Varadharajan, passed away today in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X